800 first look: ముత్తయ్య మురళీధరన్‌ని దించేశారు

శ్రీలంక స్పీన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ ( Muttiah Muralitharan biopic ) రియల్ స్టోరీ ఆధారంగా 800 అనే టైటిల్‌తో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ( Vijay Sethupathi as Muttiah Muralitharan ) ముత్తయ్య మురళీధరన్ పాత్రలో నటిస్తున్నాడు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఎం.ఎస్. శ్రీపతి డైరెక్ట్ చేస్తున్నాడు.

Last Updated : Oct 14, 2020, 02:41 AM IST
800 first look: ముత్తయ్య మురళీధరన్‌ని దించేశారు

శ్రీలంక స్పీన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ ( Muttiah Muralitharan biopic ) రియల్ స్టోరీ ఆధారంగా 800 అనే టైటిల్‌తో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ( Vijay Sethupathi as Muttiah Muralitharan ) ముత్తయ్య మురళీధరన్ పాత్రలో నటిస్తున్నాడు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఎం.ఎస్. శ్రీపతి డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా విడుదలైన ఈ 800 మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కి ముత్తయ్య మురళీధరన్, విజయ్ సేతుపతి అభిమానుల నుంచి మంచి స్పందన కనిపించింది. 

ముత్తయ్య మురళీధరన్ బాల్యం నుండి మొదలుకుని రిటైర్మెంట్ వరకు జరిగిన అనేక కీలక ఘట్టాలను, లెజెండరీ స్పిన్నర్‌గా ఎదిగే క్రమంలో అతడు ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ మోషన్ పోస్టర్‌లో ఆవిష్కరించారు. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ముత్తయ్య మురళీధరన్‌గా విజయ్ సేతుపతి కనిపించిన తీరు ఔరా అనిపించేలా ఉంది. అచ్చం ముత్తయ్య మురళీధరన్‌నే చూస్తున్నామా అనేంతగా విజయ్ సేతుపతిని ట్రాన్స్‌ఫామ్ చేసి మరీ దించేశారు.

శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ సినిమాకు 800 అనే టైటిల్ ( 800 movie title ) పెట్టడానికి కారణం ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ముత్తయ్య మురళీధరన్ పేరెత్తితే ముందుగా గుర్తుకొచ్చే సంఖ్య కూడా అదే. అందుకు కారణం టెస్ట్ మ్యాచ్‌ల్లో 800 వికెట్స్ తీసిన ఏకైక క్రికెటర్‌గా ముత్తయ్య మురళీధరన్ వరల్డ్ రికార్డ్ సాధించడమే. అందుకే ఆయన పేరిట ఉన్న ఆ రికార్డునే బయోపిక్ టైటిల్‌గా కన్ఫామ్ చేశారు.

Trending News