Ravi Teja’s Khiladi: రవితేజ కొత్త సినిమా డీటేల్స్ ఇవే

Ravi Teja’s Khiladi first look details: మాస్ మహారాజ రవితేజ హిట్స్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది ప్రారభంలో విడుదలైన 'డిస్కో రాజా' సినిమా ( Disco Raja movie ) జాడ కూడా లేకుండా డిజాస్టర్ అయింది. రవితేజ ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరెక్షన్‌లో 'క్రాక్' అనే చిత్రంలో ( Krack movie ) నటిస్తున్నాడు.

Last Updated : Oct 18, 2020, 05:25 AM IST
Ravi Teja’s Khiladi: రవితేజ కొత్త సినిమా డీటేల్స్ ఇవే

Ravi Teja’s Khiladi first look details: మాస్ మహారాజ రవితేజ హిట్స్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది ప్రారభంలో విడుదలైన 'డిస్కో రాజా' సినిమా ( Disco Raja movie ) జాడ కూడా లేకుండా డిజాస్టర్ అయింది. రవితేజ ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరెక్షన్‌లో 'క్రాక్' అనే చిత్రంలో ( Krack movie ) నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ జంటగా నటిస్తుండగా వరలక్ష్మీ శరత్ కుమార్ ( Actress Varalaxmi Sarathkumar ) మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. Also read : Tuck Jagadish shooting: ఆగిపోయిన టక్ జగదీష్ షూటింగ్‌

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

My first step towards #rt67 Excited about this one, stay tuned till tomorrow 11:55 AM

A post shared by RAVI TEJA (@raviteja_2628) on

రవితేజ శనివారం తన 67వ చిత్రం గురించి తన ఇన్‌స్టాగ్రాంలో వెల్లడించాడు. ఈ చిత్రంకి సంబందించి ఫస్ట్ లుక్, ముహూర్తం వివరాలను రేపు ఉదయం 11.55 గంటలకు విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ ఆధారంగా వెల్లడించాడు. గతంలో 'వీర' సినిమాని డైరెక్ట్ చేసిన రమేష్ వర్మ పెన్మెత్స ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు ప్రొడ్యూస్ చేయనున్నాడు. Also read : Vakeel Saab shooting: వకీల్ సాబ్ షూటింగ్‌కి పవన్ కల్యాణ్ రెడీ

టాలీవుడ్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ చిత్రానికి 'ఖిలాడి' ( Khiladi movie ) అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అని కూడా టాక్. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి ( Meenakshi Choudhary, Dimple Hayati ) ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా ఖరారైనట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం రేపు ఉదయం వరకు వేచి చూడాల్సిందే మరి. Also read : Prabhas birthday gift: బర్త్ డే గిఫ్టుపై ప్రభాస్ పోస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News