Keshubhai Patel Dies | అహ్మదాబాద్: బీజేపీ సీనియర్ నేత, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ (92) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఇటీవల అహ్మదాబాద్‌లోని స్టెర్లింగ్ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో గురువారం కేశుభాయ్ పటేల్ (Keshubhai Patel Passed Away) తుదిశ్వాస విడిచారు. గుజరాత్ మాజీ సీఎం కేశుభాయ్ పటేల్ మరణం పట్ల బీజేపీ నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా 1995లో తొలిసారిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం రెండో పర్యాయం 1998 నుంచి 2001 వరకు సీఎంగా సేవలు అందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీనియర్ బీజేపీ నేత ఆరు పర్యాయాలు విజయం సాధించారు. 1980లో బీజేపీలో చేరిన తరువాత పార్టీ డెవలప్‌మెంట్ కోసం ఎంతగానో శ్రమించారు. కేశుభాయ్ పటేల్ అనంతరం గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి పాలనలో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చారు.
Keshubhai Patel, Former Chief Minister of Gujarat, passes away at the age of 92. He was admitted at a hospital in Ahmedabad. (File pic) pic.twitter.com/RZu4cMmLDp
— ANI (@ANI) October 29, 2020
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe