Meka Suri 2 trailer: నితిన్ చేతుల మీదుగా మేక సూరి 2 ట్రైలర్ లాంచ్

క్రైం థ్రిల్ల‌ర్‌గా జులైలో ఆడియెన్స్ ముందుకొచ్చిన మేక సూరి మూవీకి భారీ స్పందన కనిపించడంతో తాజాగా ఈ మూవీకి సీక్వెల్ కూడా రూపొందింది. త్రినాధ్ వెలిశాల డైరెక్ట్ చేసిన ఈ సీక్వెల్‌కి సంబంధించిన మేక‌సూరి 2 ట్రైల‌ర్‌ను టాలీవుడ్ న‌టుడు నితిన్ లాంచ్ చేశాడు.

Last Updated : Nov 15, 2020, 09:32 PM IST
Meka Suri 2 trailer: నితిన్ చేతుల మీదుగా మేక సూరి 2 ట్రైలర్ లాంచ్

క్రైం థ్రిల్ల‌ర్‌గా జులైలో ఆడియెన్స్ ముందుకొచ్చిన మేక సూరి మూవీకి భారీ స్పందన కనిపించడంతో తాజాగా ఈ మూవీకి సీక్వెల్ కూడా రూపొందింది. త్రినాధ్ వెలిశాల డైరెక్ట్ చేసిన ఈ సీక్వెల్‌కి సంబంధించిన మేక‌సూరి 2 ట్రైల‌ర్‌ను టాలీవుడ్ న‌టుడు నితిన్ లాంచ్ చేశాడు. మేక‌సూరి నేరచరిత్రను హైలైట్ చేస్తూ అతడిని పట్టుకోవడం అంత ఈజీ కాదని మేక సూరి కోసం వేట సాగిస్తున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీస‌ర్ చెబుతున్న డైలాగ్స్ చూస్తే.. మేక సూరి అనే వ్యక్తి ఎంత పెద్ద క్రిమినల్ అనే విషయం అర్థమవుతోంది. మరోవైపు మేక సూరి సైతం తనకు గన్ను కంటే కత్తే సుతారంగా ఉంటుందని చెప్పడం మేక సూరి 2 ట్రైలర్‌లో ( Meka Suri 2 trailer ) చూడొచ్చు. 

 

అభిన‌య్, లిరిషా ప్రధాన పాత్రల్లో నటించిన మేక సూరి 2 మూవీ న‌వంబ‌ర్ 27 జీ5లో ( Zee 5 ) ప్రసారం కానుంది.

Trending News