అన్నదాతలకు ఉచిత విద్యుత్ కోసం మెగా సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం కానుంది. ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టు పూర్తయితే..30 ఏళ్ల వరకూ రైతులకు ఉచితంగా విద్యుత్ అందుతుంది.
ఏపీ ( AP ) లో మరో ప్రతిష్ఠాత్మక భారీ విద్యుత్ ప్రాజెక్టు ( Mega power project ) రాబోతుంది. రాబోయే 30 ఏళ్ల పాటు రైతులకు ఉచితంగా విద్యుత్ అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ఆలోచన మేరకు ఈ ప్రాజెక్టు నిర్మించబోతున్నారు. ఏకంగా పదివేల మెగావాట్ల భారీ సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ( Mega solar power plant ) కు రూపకల్పన చేశామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ( minister balineni srinivasa reddy ) తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు జ్యుడిషియల్ రివ్యూ పూర్తి చేసుకుని..టెండర్ల దశలో ఉందన్నారు మంత్రి బాలినేని.
వ్యవసాయ విద్యుత్ ( Agriculture power ) పై ఇస్తున్న సబ్సిడీ 2015-16లో 3 వేల 156 కోట్లుండగా..2020-21 నాటికి 8 వేల 354 కోట్లకు చేరిందని ఇంధన శాఖ తెలిపింది. ప్రస్తుతం డిస్కమ్ లు విద్యుత్ కొనుగోలుకు యూనిట్ 4 రూపాయల 68 పైసలు చెల్లిస్తుండగా..సౌర విద్యుత్ ధరకు మాత్రం 2.43 నుంచి 3.02 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మెగా సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే..రానున్న 30 ఏళ్లలో 48 వేల 8 వందల కోట్లు ఆదా చేయవచ్చని అధికారులు అంచనా వేశారు. సౌర విద్యుత్ ప్రాజెక్టును అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. సాంకేతిక ప్రమాణాల ఆధారంగా సౌర విద్యుత్ యూనిట్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాల్ని అణ్వేషిస్తోంది ప్రభుత్వం ( Ap government ).
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR
Also read: AP: మరో అల్ప పీడనం, దక్షిణ కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన