మాధవన్ 'బ్రీత్' ట్రైలర్ విడుదల

నటుడు మాధవన్ తొలిసారిగా ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. అయితే ఇది సినిమా కాదండోయ్.. ఓ వెబ్ సిరీస్.

Last Updated : Jan 5, 2018, 06:36 PM IST
మాధవన్ 'బ్రీత్' ట్రైలర్ విడుదల

నటుడు మాధవన్ తొలిసారిగా ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. అయితే ఇది సినిమా కాదండోయ్.. ఓ వెబ్ సిరీస్. అమెజాన్ సంస్థ నిర్మించే ఈ వెబ్ సిరీస్‌‌కు "బ్రీత్" అని పేరు పెట్టారు. ‘బిడ్డ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిస్తే ఆ బిడ్డను బతికించుకోవడానికి తల్లిదండ్రలు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఆఖరికి సైకోగా మారడానికి కూడా వెనుకాడరు.’ అన్న డైలాగ్‌‌తో ఈ టీజర్ సాగుతుంది. ఓ పోలీస్ అధికారికి‌, ఓ నరహంతకుడి మధ్య జరగిన పోరాటమేమిటి? ఓ తండ్రి తన కుమారుడిని ఎలా కాపాడుకున్నాడు? అన్న కథాంశంతో పూర్తిస్థాయి థ్రిల్లర్‌గా ఈ సిరీస్ తెరకెక్కుతుంది. ఈ చిత్రం ద్వారా తొలిసారిగా డిజిటల్ సిరీస్‌లో నటించే అవకాశం పొందారు నటుడు మాధవన్. మణిరత్నం దర్శకత్వం వహించిన 'సఖి' చిత్రంతో చిత్రరంగానికి పరిచయమైన మాధవన్ 3 ఈడియట్స్, రంగ్ దే బసంతీ, తను వెడ్స్ మను లాంటి బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించారు. 

 

Trending News