ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అసిస్టెంట్ కోచ్ అవతారం ఎత్తనున్నారు. త్వరలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ దేశాల జట్లతో జరగబోయే టీ20 సిరీస్కు వెళ్లే తమ జట్టుకు ఆయన సహకోచ్గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా కోచ్గా ఉన్న డారెన్ లెహ్మన్కు ఆయన సహాయంగా కొద్ది రోజులు వ్యవహరిస్తారు.
అయితే 2019లో జరిగే యాషెస్ సిరీస్ తర్వాత లెహ్మన్ కోచ్ పదవి నుండి తప్పుకుంటానని చెప్పిన సందర్భంలో, ఆయన స్థానంలోకి భవిష్యత్తులో పాంటింగ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు క్రీడా విశ్లేషకులు. తన కెరీర్లో151 టెస్టులు మరియు 352 వన్డేలు ఆడిన పాంటింగ్, ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా కూడా రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ మేటి క్రికెటర్లలో పాంటింగ్ కూడా ఒకరిగా స్థానం దక్కించుకున్నారు.