AP: స్థానిక సంస్థల సంస్కరణల్లో ఏపీ, ఎంపీలే టాప్..కేంద్రం ప్రశంసలు

పరిపాలనకు పట్టుగొమ్మలు స్థానిక సంస్థలు. స్థానిక సంస్థల సంస్కరణలు మెరుగ్గా ఉంటే రాష్ట్రాల పరిస్థితి బాగుంటుంది. ఏపీ,మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అదే పని చేశాయి. కేంద్రం నుంచి ప్రశంసలందుకున్నాయి.

Last Updated : Dec 23, 2020, 07:52 PM IST
  • స్థానిక సంస్థల్లో మెరుగైన సంస్కరణల్లో ఏపీ, ఎంపీలు టాప్..కేంద్రం ప్రశంసలు
  • వైద్యం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పౌర సేవల విభాగాల్లో మెరుగైన పనితీరు
  • అదనంగా రుణ సౌకర్యం కల్పించిన కేంద్ర ప్రభుత్వం
AP: స్థానిక సంస్థల సంస్కరణల్లో ఏపీ, ఎంపీలే టాప్..కేంద్రం ప్రశంసలు

పరిపాలనకు పట్టుగొమ్మలు స్థానిక సంస్థలు. స్థానిక సంస్థల సంస్కరణలు మెరుగ్గా ఉంటే రాష్ట్రాల పరిస్థితి బాగుంటుంది. ఏపీ,మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అదే పని చేశాయి. కేంద్రం నుంచి ప్రశంసలందుకున్నాయి.

స్థానిక సంస్థల్లో సంస్కరణలనేవి చాలా కీలకం..అత్యవసరం కూడా. ఆంధ్రప్రదేశ్ ( AP ) , మధ్య ప్రదేశ్ ( MP ) రాష్ట్రాలు స్థానిక సంస్థల్లో చేసిన సంస్కరణలు ( Best reforms in local bodies ) సత్ఫలితాలనిచ్చాయి. మెరుగైన ప్రజల ఆరోగ్యం, పారిశుద్ధ్య నిర్వహణ, స్థానిక సంస్థల ఆర్ధిక వనరుల్ని బలోపేతం చేయడం, మెరుగైన పౌర సేవల్లో ఈ రెండు రాష్ట్రాలు చాలా బాగా పని చేశాయని కేంద్రం గుర్తించింది. స్థానిక సంస్థల సంస్కరణల్లో ఏపీ, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు నెంబర్ వన్ స్థానంలో నిలిచాయని కితాబిచ్చింది కేంద్ర ప్రభుత్వం ( Central Government ). 

ఇందులో భాగంగా మరింతగా రుణ సౌకర్యానికి అనుమతిచ్చింది. ఏపీకు 2 వేల 525 కోట్ల రూపాయలు, మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి 2 వేల 373 కోట్ల రూపాయల రుణ సౌకర్యాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా సంక్షోభం ( Corona pandemic ) నేపధ్యంలో రాష్ట్రాల జీఎస్డీపీపై 2 శాతం అదనంగా రుణం తీసుకునే సౌకర్యం అందించింది. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నాలుగు సంస్కరణల్ని అమలు చేసిన రాష్ట్రాలకు మాత్రమే ఈ రుణ సౌకర్యం అవకాశముంటుంది. ఆంధ్రప్రదేశ్ ఈ సంస్కరణల్ని విజయవంతంగా అమలు చేసింది. 

Also read: Union Cabinet Meet: ఎస్సీ విద్యార్ధులకు వరాలు జల్లు..కీలక నిర్ణయాలు

Trending News