Candida auris fungus: కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే ప్రపంచం అతలాకుతలమైంది. వైరస్ నుంచి పూర్తిగా కోలుకోకముందే..మరో ప్రమాదకర వార్త భయపెడుతోంది. కోవిడ్ కంటే భయంకరమైన ఫంగస్ హెచ్చరిక అది..
కోవిడ్ వైరస్ ( Covid virus ) ప్రపంచం నుంచి దాదాపు ఓ ఏడాది కాలాన్ని దూరం చేసింది. వైరస్ దెబ్బకు ప్రపంచమంతా స్థంబించిపోయింది. వైరస్ ఇంకా దూరం కాకముందే కరోనా కొత్త స్ట్రెయిన్ ( New coronavirus strain ) బ్రిటన్ ( Britain ) నుంచి ప్రారంభమై మరోసారి భయపెట్టింది. సరిగ్గా అదే తరుణంలో వ్యాక్సినేషన్ ( Vaccination ) ప్రారంభం కావడంతో ప్రపంచం కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే వ్యాక్సిన్ సామర్ధ్యంపై నెలకొన్న సందేహాలు దూరం కావడం లేదు. వ్యాక్సిన్ ( Vaccine ) ఎంతవరకూ సమర్ధవంతంగా పనిచేస్తుందనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో లండన్ ( London ) లోని ఇంపీరియల్ కాలేజి ( Imperial College ) శాస్త్రవేత్తలు మరో కలవరపాటుకు గురి చేసే వార్త విన్పించారు.
ఈసారి వైరస్ కాదు..ఫంగస్. క్యాండిడా ఆరిస్ అనే ఫంగస్ ఎన్నో రెట్టు ప్రమాదకరమైందని హెచ్చరిస్తున్నారు. క్యాండిడా ఆరిస్ ఫంగస్ రక్తంలో ప్రవేశిస్తే..ఎటువంటి విరుగుడు ఉండదని..ప్లేగు ( Plague ) వ్యాధి తరహాలో వ్యాపించే అవకాశముందని అంటున్నారు. క్యాండిడా ఆరిస్ ( Candida Auris Fungus ) బారిన పడితే బతికే అవకాశాలు తక్కువని చెబుతున్నారు. సంక్రమణ ప్రారంభమైతే పెద్ద సంఖ్య మరణాలుంటాయని హెచ్చరిస్తున్నారు. 2016లోనే ఇంగ్లండ్ ( England ) లో దీని ఆనవాళ్లు గుర్తించామని..ఎలాంటి వాతావరణంలోనైనా జీవించగల సామర్ధ్యం ఉంటుందంటున్నారు.
Also read: Corona vaccination: ఇండియా ఈ ప్రపంచానికే గొప్ప ఆస్థి: ఐక్యరాజ్యసమితి ప్రశంసలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook