Today Horoscope In Telugu 11 February 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ప్రతి సంకేతాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఫిబ్రవరి 11న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
మేష రాశి
మీ సన్నిహితులు, స్నేహితుల సహకారం అందుతుంది. ఈరోజు ప్రశాంతంగా గడుస్తుంది. మీరు విరామం తీసుకుని మీ గురించి ఆలోచించడం శ్రేయస్కరం. ఎంత తీరిక లేని పనులతో గడుపుతున్నా, ఈరోజు కొన్ని కారణాలతో వాటిని పక్కనపెడతారు. ఏ విషయంలోనూ ఒత్తిడికి గురికారు.
వృషభ రాశి
అసాధారణ విషయాలు, పనులు చేయడం ద్వారా ఈరోజు ముందుకు సాగుతారు. మీ పరిధులను విస్తృతం చేయడానికి, కొత్త విషయాలను అన్వేషించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. అదే పనిని పదే పదే చేయడం ద్వారా కాస్త విసుగు చెందుతారు.
మిథున రాశి
ఈ రోజు మీరు భావోద్వేగానికి లోనవుతారు. మీరు కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు. మీలో ఉన్న భావాలు పరుగులు తీస్తుంటాయి. కానీ ఈరోజు తొందరపాటు తగదు. వీలు చిక్కితే పని నుండి ఒక రోజు సెలవు తీసుకుంటారు. దీని ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
కర్కాటక రాశి
మీ చుట్టు ఉన్న కొందరు మిమ్మల్ని అణగదొక్కడానికి ప్రయత్నించవచ్చు. అయితే మీ ప్రయత్నాల ద్వారా వారి ప్రయత్నాలు విఫలం అవుతాయి. మీ భావోద్వేగమే మీకు బలహీనతగా మారుతుంది. ఇతరులు దానిని సద్వినియోగం చేసుకుంటారు. ఇతరుల విషయాలు వినేందుకు నేడు మంచిది కాదు. మీరు యజమానిలాగ అడుగు ముందుకు వేసి కార్యసిద్ధి పొందుతారు.
సింహ రాశి
ఈరోజు మీకు కలిసొస్తుంది. మీరు కోరుకున్న విషయాలు జరుగుతాయి. కాబట్టి దేని గురించి నేడు చింతించకండి. గతంలో మీరు చేసిన ఆలోచనలు నేడు ఫలితాన్ని అందిస్తాయి. తొందరపాటు తగదు. ఆకస్మిక ధనలాభం.
కన్య రాశి
కన్య రాశి వారు ఈరోజు భావోద్వేగాలను నియంత్రించుకుంటారు. మీ హృదయం ఏదో కోరుకుంటుంది. అయితే మీ మెదడు వేరేదాన్ని కోరుతుంది. లాభనష్టాలను ఆలోచించి మీకు ఉత్తమంగా కనిపించిన బాటలో నడవండి. కొన్నిసార్లు మెదడు చెప్పేదానికన్నా మీ మనసును విశ్వసించడం లాభదాయకం.
తులా రాశి
వ్యక్తిగత సంబంధాలు ఈ రోజు తారాస్థాయికి చేరుకుంటాయి. మీ చుట్టూ ఉన్న వారితో మీకు ఏమైనా సమస్యలు ఉంటే, వాటికి పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు మీరు చాలా సంతోషంగా గడుపుతారు. గత కొంతకాలం మీరు మాట్లాడని వారిని కలుసుకునేందుకు తగిన సమయం.
వృశ్చిక రాశి
ఈ రోజు మీరు చాలా విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇతరులు అనవసరంగా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నందున మీరు కొంచెం ఆందోళన చెందుతారు. ప్రతిదీ తెలియదు అనే విషయం మీకు చాలా బాగా తెలుసు. కాబట్టి ఓపెన్ మైండ్‌తో ఆలోచిస్తారు. ఇతరుల మాటల్ని మీరు వింటున్నారని గుర్తిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఇది మీకు కలిసొస్తుంది.
ధనస్సు రాశి
ఈరోజు మీరు ఆశ్చర్యకర వార్తలు వింటారు. ఊహించని సంఘటనలు జరుగుతాయి. అయినా మీరు చింతించనవసరం లేదు. అంతా సజావుగానే జరుగుతుంది. మీకు నేడు కలిసొచ్చే సూచనలు ఉన్నాయి. శుభవార్తలు వింటారు.
మకర రాశి
మీరు చాలా కష్టపడతారు. అయితే భావోద్వేగాలు తీవ్రంగా ఉంటాయి. మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తులకు దూరంగా ఉంటారు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. మీ తెలివితేటలతో సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.
కుంభ రాశి
ఇతరుల నుండి దూరంగా ఉండటం నేర్చుకుంటారు. మీరు నమ్మిన అందరూ మీకు స్నేహితులు కాదని గ్రహిస్తారు. ఈ రోజు మీ కళ్లు తెరుచుకుంటాయి. ఇతరుల బుద్ధిని తెలుసుకుని ప్రవర్తిస్తారు. మీకు అంతా శుభమే జరుగుతుంది. నేడు ఎక్కువ సమయం కుటుంబంతో గడుపుతారు.
మీన రాశి
ఈ రోజు మీరు చాలా వేగంగా పనులు చేస్తారు. కానీ విషయాల్ని ఇతరులకు నొక్కిచెప్పాలి. మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. అలా జరగాలంటే మీరు ప్రశాంతంగా ఉండాలి. మీ పనులను పేపర్‌పై రాసి క్రమపద్ధతిలో పూర్తి చేసుకుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook