Ap municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మార్చ్‌లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది.
ఏపీలో పంచాయితీ ఎన్నికల ( Panchayat elections )పోరు కొనసాగుతుండగానే..మరో ఎన్నికల నగారా మోగింది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్( Municipal elections schedule )ను ఎన్నికల కమీషనర్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీల ఎన్నికల కోసం ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మార్చ్ 10న మున్సిపల్ పోలింగ్ జరగనుండగా..14వ తేదీన కౌంటింగ్ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు తేదీ మార్చ్ 3 వ తేదీగా ప్రకటించారు. షెడ్యూల్లో రాజమండ్రి కార్పొరేషన్ ప్రస్తావన లేదు. పంచాయితీల విలీనానికి సంబంధించిన ప్రక్రియ మిగిలుండటంతో రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నిక ఈసారి లేదని తెలుస్తోంది.
విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం కార్పొరేషన్లతో పాటు 75 మున్సిపాల్టీలు, నగర పంచాయితీలకు ఎన్నికలు జరగనున్నాయి. కాకినాడ కార్పొరేషన్ గడువు ఇంకా ముగియలేదు. రాజమండ్రి కార్పొరేషన్ ( Rajahmundry corporations )కు సంబంధించి విలీన ప్రక్రియ కారణంగా వాయిదా పడింది.
గతంలో అంటే 2020 మార్చ్‌లో కరోనా కారణంగా ఎన్నికలు నిలిచిన ప్రక్రియ నుంచే ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యేలా ఎన్నికల కమీషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లెక్కన గత ఏడాది ఎన్నికలు నిలిచేనాటికి దాఖలైన నామినేషన్లు అమల్లో రానున్నాయి.
Also read: Ap Municipal Elections: మున్సిపల్ ఎన్నికలకు సైతం సిద్ధం: మంత్రి బొత్స
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook