Madhya pradesh Accident: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు కలవరం కల్గిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కెనాల్లో ఓ బస్సు పడిపోవడంతో 32 మంది మరణించినట్టు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మద్యప్రదేశ్ ( Madhya pradesh ) రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సిధి నుంచి సత్నాకు వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి వంతెనపై నుంచి కెనాల్లో పడిపోయింది. ఆ సమయంలో బస్సులో 54 మంది ప్రయాణీకులున్నారు. ఈ ఘటనలో 32 మంది మరణించినట్టు సమాచారం. ఇప్పటి వరకూ 7 గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన 40 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరో ఏడుగురిని రక్షణ బృందాలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
ఈ ప్రమాదంపై స్పందించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( Pm Narendra modi ) విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేసి..క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ఆదేశించారు. అటు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ( Mp cm Sivaraj singh chouhan ) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటన నేపధ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరగాల్సిన వర్చువల్ మీటింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకుంది. ప్రమాద సమయంలో కెనాల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బస్సు వేగంగా కొట్టుకుపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Also read: 7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు Supreme Court శుభవార్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook