RTC Services: కరోనా మహమ్మారి నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కొన్ని బహిరంగ ప్రదేశాల్ని క్లోజ్ చేసిన ప్రభుత్వ..మరికొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఆర్టీసీ ప్రయాణాల్లో కొత్త మార్గదర్శకాల్ని అమల్లోకి తీసుకొచ్చింది.
కరోనా నియంత్రణకు ( Corona virus ) ప్రభుత్వం ఇప్పటికే పలు మార్గదర్శకాల్ని జారీ చేసింది. జిమ్‌లు, బీచ్‌లు, పార్క్‌లు మూసివేసిన ప్రభుత్వం థియేటర్లలో ( Theatres) 50 శాతం ప్రేక్షకుల్నే అనుమతించాలని నిబంధన పెట్టింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ప్రభుత్వం (Ap government) కొత్తగా ఆర్టీసీ ( RTC) లో కొన్ని మార్గదర్శకాల్ని అమల్లో తీసుకొచ్చింది. బస్సుల్లో గరిష్టంగా 50 శాతం మంది ప్రయాణీకుల్నే అనుమతిస్తోంది. ఇప్పటికే కరోనా సంక్రమణ నేపధ్యంలో ప్రయాణీకుల సంఖ్య చాలావరకూ తగ్గింది. ఈ నెలలో అయితే రోజుకు 57 శాతం ఆక్సుపెన్సీనే నమోదైంది.
కరోనా మహమ్మారి కారణంగా ఆక్సుపెన్సీ రేటు 50 శాతానికి ( 50 percent Occupancy)పరిమితమైంది. ఫలితంగా ఆర్టీసీ (APSRTC) ఆదాయంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. రోజుకు 14 కోట్ల ఆదాయం రావల్సి ఉంటే..7 కోట్ల ఆదాయం మాత్రమే వస్తోంది. మరోవైపు ఆర్టీసీ బస్సు సర్వీసుల్ని కూడా తగ్గించింది. డిమాండ్ అంతగా లేని రూట్స్‌లో సర్వీసుల్ని తగ్గించింది. ఆర్టీసీ రోజు 10 వేల 553 షెడ్యూళ్లలో బస్సులు నిర్వహించాల్సి ఉండగా..25 శాతం తగ్గించింది. అటు ఆర్టీసీ బస్ స్టేషన్లు, కార్యాలయాల్లో సైతం కరోనా నిబంధనల్ని అమలు చేస్తున్నారు.
Also read: AP Covid Update: ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, లాక్‌డౌన్‌పై రేపు నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook