French Open 2021 Winner Female: చెక్ రిపబ్లిక్ అమ్మాయి బార్బరా క్రేజికోవా ఫ్రెంచ్ ఓపెన్ 2021 విజేతగా అవతరించింది. 25 ఏళ్ల యువ సంచలన క్రేజికోవా ఫ్రెంచ్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ ఫైనల్లో 6-1, 2-6, 6-4 తేడాతో రష్యాకు చెందిన అనస్తేసియా పవ్లిచెంకోవాపై విజయం సాధించి మట్టికోర్టులో రారాణిగా Barbora Krejcikova నిలిచింది.
శనివారం జరిగిన ఫైనల్లో విజేతగా నిలిచి తొలి గ్రాండ్‌స్లామ్ విన్నర్‌గా నిలవాలని ఆశించిన రష్యా భామ పవ్లిచెంకోవాకు 52వ ప్రయత్నంలోనూ నిరాశ తప్పలేదు. మరోవైపు తొలి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న క్రేజికోవా సీడెడ్ క్రీడాకారిణి కూడా కాదు. కానీ ఏ మాత్రం తడబడకుండా పోరాటపటిమతో ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకుంది. 1981 తరువాత ఫ్రెంచ్ ఓపెన్ (French Open 2021) సింగిల్స్ విజేతగా నిలిచిన క్రీడాకారిణిగా బార్బరా క్రేజికోవా (Barbora Krejcikova) నిలిచింది.
Also Read: WTC Final 2021: సౌతాంప్టన్‌లో Team India ప్రాక్టీస్ వీడియో షేర్ చేసిన BCCI
One word: Happy 😁
Congratulations, @BKrejcikova 👏 pic.twitter.com/NiVaegM0NR
— Roland-Garros (@rolandgarros) June 13, 2021
రోలాండ్ గారోస్‌లో శనివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో (French Open 2021 Final Highlights) తొలి సెట్‌ను 6-1తో నెగ్గింది. రెండో సెట్లో ప్రత్యర్థి, 31వ సీడెడ్ ప్లేయర్ పవ్లిచెంకోవా దూకుడు పెంచింది. వరుసగా 3 గేమ్‌లు గెలిచింది, ఆపై 6-2తో రెండో సెట్ గెలిచి 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో సెట్లో చెక్ క్రేజికోవా, పవ్లి చెంకోవా హోరాహోరీగా తలపడ్డారు. 4-3తో ఉన్న దశలో రెండు వరుస పాయింట్లు నెగ్గడంతో సెట్‌తో పాటు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను చెక్ రిపబ్లిక్ భామ క్రేజికోవా ముద్దాడింది.
Also Read: Suresh Raina: టీమిండియా మాజీ కోచ్ Greg Chappellపై సురేష్ రైనా ప్రశంసలు
Brilliant Barbora ✨
Look back on how the unseeded Czech became a Grand Slam singles champion. #RolandGarros
— Roland-Garros (@rolandgarros) June 12, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook