అదృష్టం ఎవరిని.. ఎలా వరిస్తుందో ఉహించటం కష్టం. ఎంత కష్టపడ్డ కొంత మందికి అదృష్టం బాగోలేక సమయం కోసం ఎదురుచూస్తుంటారు. కానీ కొంత మందికి ఏం చేయకపోయిన లేదా వారు చేసే చిన్న సరదా పనులతో అదృష్టం కలసి వస్తుంది.. ఇలాంటి సంఘటనే ఒకటి ఆస్ట్రేలియాలో జరిగింది. ఒక యువతి చిప్స్ పాకెట్ లో కాస్త వింత గా ఉన్న ఆలు చిప్స్ ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా కొంత మంది అమ్మేయమని సలహా ఇచ్చారు... దీంతో ఆన్ లైన్ లో వేలం వేయగా ఆ ఆలు చిప్ ముక్క 14 లక్షల రూపాలకు అమ్ముడుపోవటంతో ఆ యువతి లక్షాదికారి అయిపొయింది.
వివరాల్లోకి వెళ్తే... ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ నగరంలో నివాసం ఉంటున్న 13 ఏళ్ల రైలీ స్టువార్ట్ అనే యువతికి ఆలు చిప్స్ అంటే అమీతమైన ఇష్టం. ఆస్ట్రేలియాకి చెందిన ప్రముఖ చిప్స్ బ్రాండ్ డోరిటోస్ ఆలు చిప్స్ రోజు తింటుంది. యధావిధిగా ఆ రోజు కూడా డోరిటోస్ చిప్స్ పాకెట్ ను కొనుక్కొని తింటూ ఉండగా ప్యాకెట్ లో ఒక వింతైన ఆలు చిప్ ముక్క తారసపడింది. మిగతా చిప్స్ ముక్కల్లా కాకుండా ఈ చిప్ ముక్క సమోసాలా ఉబ్బి ఉండటంతో దానిని తినకుండా భద్రంగా దాచుకుంది. ఒక రోజు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే ఇక... ఆ వీడియో క్షణాల్లో వైరల్ అవ్వటం కొన్ని మిలియన్ల వ్యూస్ రావటంతో ఆ అమ్మాయికి ఆనందంతో ఎగిగి గంతేసింది.
Also Read: Bisaccia City: నాలుగు సిగరెట్ల ధరకే అక్కడ ఇళ్లు..మీకూ కావాలంటే త్వరపడండి
This 13-year-old was paid $20,000 by Doritos after finding a perfectly puffy chip 😱 pic.twitter.com/mFRfWVr5F0
— NowThis (@nowthisnews) August 20, 2021
సమోసాలగా ఉబ్బి ఉన్న ఆ చిప్ ముక్కని అమ్మితే కొనుక్కుంటామని చాలా మంది కామెంట్స్ పెట్టడంతో ఫాలోవర్స్ కోరిక మేరకు ఈబే సైట్లో దాని ధర ఒక డాలర్ గా వేలంలో పెట్టింది. కొన్ని గంటల్లోనే దాని విలువ సుమారు 2 వేల డాలర్ల వరకు చేరటం గమనార్హం. ఇది అంత చూసిన డోరిటోస్ కంపెనీ యాజమాస్యం కూడా వేలంలో పాల్గొనటం... అందరికన్నా ఎక్కువగా 20,100 డాలర్లు అనగా మన దేశ కరెన్సీ ప్రకారం 14,90,251 రూపాయలు కోట్ చేయటం.. దాన్ని కొనటం క్షణాల్లో జరిగిపోగా... ఇదంతా చూస్తున్న రైలీ స్టువార్ట్ తల్లి-దండ్రులు ఆశ్చర్యపోయారు. సరదాకి తమ కూతురు చేసిన పనికి ఇంత మొత్తంలో లాభం రావటం మా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఈ విషయం తెలిసిన కొంత మంది నెటిజన్లు మాత్రం డోరిటోస్ కంపెనీ అత్యుత్సాహాంతో లక్షల రూపాయలు పోగొట్టుకుందని కొంత మంది కామెంట్ చేసారు. ఈ విషయంపై డోరిటోస్ కంపెనీ, "ఇంకొకరైతే ఈ చిప్ ముక్కని తినేసే వారు.. కానీ ఈ యువతి వ్యాపార కోణంలో సృజనాత్మకంగా అలోచించి వ్యాపారాన్ని పెంచింది. ఆ యువతి సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన వీడియో వలన కోట్లు ఖర్చు పెట్టిన కుడా రాని ప్రచారం మా కంపెనీకి జరిగింది, అందుకే ఆ అమ్మాయి సృజనాత్మక ఆలోచన మాకు నచ్చి వేలంలో పెద్ద మొత్తం చెల్లించి దక్కించుకున్నామని" డోరిటోస్ కంపెనీ వాపోయింది.
Also Read: Coronavirus: ఆఫ్ఘన్ నుంచి ఇండియా వచ్చినవారికి కరోనా వైరస్, ఆందోళన కల్గిస్తున్న పరిణామాలు
ఏదిఎమైనా ఆ యువతి చేసిన సరదా పనికి పెద్ద మొత్తంలో డబ్బే కాకుండా, కంపెనీ కూడా ఉచిత ప్రచారం జరిగింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook