Sarvadarshanam Tickets: హాట్‌కేకుల్లో తిరుమల సర్వదర్శనం టోకెన్లు, కేవలం 35 నిమిషాల్లో..

Sarvadarshanam Tickets: తిరుమల సర్వదర్శనం ఉచిత టోకెన్లు హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయి. ఆన్‌లైన్ టోకెన్ అమ్మకాలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లక్షల టోకెన్లు బుక్ అయ్యాయి. కేవలం 35 నిమిషాల్లో..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 25, 2021, 11:30 AM IST
  • ఆన్‌లైన్‌లో ప్రారంభమైన తిరుమల ఉచిత సర్వదర్శనం టికెట్లు
  • హాట్ కేకుల్లా అమ్ముడైన సర్వదర్శనం టికెట్లు, 35 నిమిషాల్లో 2.79 లక్షల టోకెన్లు
  • రోజుకు 8 వేల సర్వదర్శనం టికెట్ల పంపిణీ
 Sarvadarshanam Tickets: హాట్‌కేకుల్లో తిరుమల సర్వదర్శనం టోకెన్లు, కేవలం 35 నిమిషాల్లో..

Sarvadarshanam Tickets: తిరుమల సర్వదర్శనం ఉచిత టోకెన్లు హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయి. ఆన్‌లైన్ టోకెన్ అమ్మకాలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లక్షల టోకెన్లు బుక్ అయ్యాయి. కేవలం 35 నిమిషాల్లో..

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో కాస్సేపటి క్రితం విడుదలయ్యాయి. ఇవాళ అంటే సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 9 గంటలకు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirupatibalaji.ap.gov.in ద్వారా భక్తులకు అందుబాటులో తీసుకొచ్చింది టీటీడీ. రోజుకు 8 వేల టికెట్లను ఇవ్వనుంది. ఆన్‌లైన్ టోకెన్లు అమ్మకం ప్రారంభమైన కాస్సేపటికే 35 నిమిషాల్లోనే 35 రోజుల టోకెన్లు బుక్ అయ్యాయి. రికార్డు స్థాయిలో 35 నిమిషాల్లోనే 2 లక్షల 79 వేల టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ నెల 25 నుంచి అక్టోబర్ 31 వరకూ సర్వదర్శనం టోకెన్లు(Sarvadarshanam Tickets) అందుబాటులో ఉంటాయి. వర్చువల్ క్యూ పద్ధతిలో ముందుగా లాగిన్ అయినవారికి అవకాశం కల్గింది. వర్చువల్ క్యూ పద్థతి పాటించడంతో సర్వర్లు క్రాష్ కాలేదు. ఏ విధమైన సాంకేతిక సమస్యల్లేకుండానే భక్తులు టికెట్లు బుక్ చేసుకున్నారు. 

ఆన్‌లైన్ టికెట్లు(Online Tickets) విడుదల కావడంతో ఆఫ్‌లైన్ టోకెన్లను నిలిపివేశారు.టోకెన్ పొందిన భక్తులు రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికేట్(Vaccination Certificate)లేదా 72 గంటల ముందు చేయించుకున్న కరోనా నెగెటివ్ రిపోర్ట్ వెంట తీసుకెళ్లాలి. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్ నిర్వహణకు జియో సంస్థ ఉచిత సహకారం అందిస్తోంది.మొబైల్ పోన్ ద్వారా లాగిన్ కావాలంటే సంబంధిత ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. వెబ్‌సైట్‌లో పచ్చరంగులో అంటే అందుబాటులోని తేదీల్లో స్లాట్లను బుక్ చేసుకోవల్సి ఉంటుంది. ఎంతమంది భక్తులు సందర్శిస్తారనే వివరాలు కూడా నమోదు చేయవల్సి ఉంటుంది. 

Also read: Coronavirus New Variant: కరోనా వైరస్ కొత్త వేరియంట్ జాడ ఇండియాలో ఉందా లేదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News