Breaking news: భవానీపుర్​లో దీదీ గెలుపు...58 వేల ఓట్ల తేడాతో గెలుపు

Mamata Banerjee: భవానీపుర్ ఉపఎన్నికలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి ప్రియాంక టిబ్రివాల్​పై 58,389 ఓట్ల తేడాతో గెలుపొందారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 3, 2021, 02:57 PM IST
  • భవానీపుర్‌లో మమతా విజయం
  • 58 వేల ఓట్ల తేడాతో గెలుపు
  • గతంలో నందిగ్రామ్‌లో ఓడిపోయిన దీదీ
Breaking news: భవానీపుర్​లో దీదీ గెలుపు...58 వేల ఓట్ల తేడాతో గెలుపు

Mamata Banerjee: పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ  భవానీపుర్‌ ఉప ఎన్నిక(Bhabanipur bypoll)లో విజయ ఢంకా మోగించారు. తన సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌(Priyanka Tibrewal)పై భారీ ఆధిక్యాన్ని నమోదు చేశారు. 

తొలి రౌండ్‌ నుంచీ మమత ఆధిపత్యం కొనసాగింది. రౌండ్‌ రౌండుకు దీదీ(Mamata Banerjee) మెజారిటీ పెరిగి 50 వేలకుపైగా చేరింది. 58,389 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగరవేశారు. ఈ విజయంతో మమత సీఎం పీఠాన్ని నిలబెట్టుకున్నారు. నవంబర్ 30న ఈ భవానీపుర్​ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. 53 శాతం పోలింగ్ నమోదైంది. సీఎంగా కొనసాగాలంటే తప్పక గెలవాల్సిన ఈ ఎన్నికలో మమత విజయం సాధించారు.

Also read: అక్కడ కిలో ఉప్పు రూ.130, కిలో చక్కెర రూ.150..కారణం ఏంటంటే..

ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పశ్చిమబెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి బరిలోకి దిగిన మమతా బెనర్జీ, ప్రత్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ ముఖ్యమంత్రిగా మే 5న బాధ్యతలు స్వీకరించారు. దీంతో అప్పటినుంచి ఆరు నెలల్లోగా అనగా.. నవంబర్‌ 5వ తేదీలోగా శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మరో రెండు స్థానాలతో పాటు మొత్తం మూడు స్థానాలకు సెప్టెంబర్‌ 30న కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్‌ నిర్వహించింది. ప్రతిష్ఠాత్మకంగా మారిన భవానీపుర్‌ నుంచి మమతా బెనర్జీ పోటీలో నిలిచారు. అయితే, మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి వీలుగా భవానీపుర్‌ నుంచి గెలుపొందిన శోభన్‌దేవ్‌ ఛటోపాధ్యాయ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ తృణమూల్‌ కాంగ్రెస్‌కు మంచి పట్టుండడంతో దీదీ గెలుపు ఖాయమయ్యింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News