Banerjee comments : మోహన్‌బాబు కొట్టడానికి వచ్చారంటూ కంటతడి పెట్టుకున్న బెనర్జీ

Banerjee comments on Mohan Babu: ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ మొత్తం మీడియాతో మాట్లాడిన సందర్భంలో బెనర్జీ పలు విషయాలు చెప్పుకుని బాధపడ్డారు. మోహన్‌బాబు తనీశ్‌ను తిడుతుంటే.. తాను విష్ణు దగ్గరకు వెళ్లి గొడవలు వద్దు నాన్నా అని సూచించాను అని అన్నారు. అది విన్న మోహన్‌బాబు.....

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 12, 2021, 07:46 PM IST
  • పలు విషయాలు చెప్పుకుని బాధపడ్డ బెనర్జీ
  • మోహన్‌బాబు తనీశ్‌ను తిడుతుంటే.. గొడవలు వద్దు అని విష్ణుకు సూచించిన బెనర్జీ
  • దీంతో తనని మోహన్‌బాబు కొట్టడానికి వచ్చాడన్న బెనర్జీ
Banerjee comments : మోహన్‌బాబు కొట్టడానికి వచ్చారంటూ కంటతడి పెట్టుకున్న బెనర్జీ

MAA Elections 2021 tollywood Actor Banerjee sensational comments on Mohan Babu: ఇటీవల ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన బెనర్జీ తన పదవికి రాజీనామా చేశారు. ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj) ప్యానెల్‌ మొత్తం మీడియాతో మాట్లాడిన సందర్భంలో బెనర్జీ (Banerjee) పలు విషయాలు చెప్పుకుని బాధపడ్డారు. తాను గెలిచిన తర్వాత తనకు అభినందనలు చెబుతున్నా తనకు సంతోషంగా లేదన్నారు. ఎన్నికల్లో దూరంగా నిలబడ్డానని చెప్పుకొచ్చారు. మోహన్‌బాబు ( Mohan Babu) తనీశ్‌ను (tanish0 తిడుతుంటే.. తాను విష్ణు దగ్గరకు వెళ్లి గొడవలు వద్దు నాన్నా అని సూచించాను అని అన్నారు. అది విన్న మోహన్‌బాబు తనను కొట్టడానికి వచ్చారని బాధపడ్డారు బెనర్జీ. అయితే విష్ణు.. మోహన్‌బాబును అడ్డుకుని తనను పక్కకు లాగేశారన్నారు. ఆ తర్వాత చాలా సేపు తనని అసభ్య పదజాలంతో మోహన్‌బాబు తిట్టారని బాధపడ్డారు.

Also Read : MAA Elections - Srikanth resigns: పదవులు లేకపోయినా మంచు విష్ణుకు అండగా ఉంటాం: శ్రీకాంత్

మోహన్‌బాబు వివాహం కాకముందు నుంచి తాను మోహన్‌బాబు (Mohan Babu) ఇంట్లో ఒక ఇంటి సభ్యుడిలా ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు. తాను మంచు లక్ష్మీని, (manchu lakshmi) విష్ణులు చిన్నగా ఉన్నప్పుడు ఎత్తుకుని తిరిగేవాడిని చెప్పారు. అయితే మోహన్‌బాబు తిడుతుంటే విష్ణు, మనోజ్‌లు (Manoj) వచ్చి తనకు సర్ది చెప్పారన్నారు బెనర్జీ. తనకు తన తల్లే సర్వస్వమని.. ఆమెను కూడా తిడుతుంటే చాలా బాధేసిందన్నారు. మా ఎన్నికల్లో (MAA Elections) తాను గెలిచినా.. కార్యవర్గ సమావేశాల్లో వాళ్లకి భయపడుతూ ఉండటం కంటే రాజీనామా చేయటం మంచిదని బెనర్జీ స్పష్టం చేశారు.

Also Read : MAA Elections Prakash Raj panel Resigns: ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్ నుంచి గెలిచిన వారంతా రాజీనామా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News