Heads & Tales Trailer : హెడ్స్‌ అండ్‌ టేల్స్‌ ట్రైలర్‌ వచ్చేసింది

Heads & Tales Official Trailer released : హెడ్స్‌ అండ్‌ టేల్స్‌..అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రముఖ ఓటీటీ జీ 5లో అక్టోబరు 22 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. తాజాగా హెడ్స్‌ అండ్‌ టేల్స్‌ ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2021, 06:23 PM IST
  • హెడ్స్‌ అండ్‌ టేల్స్‌ ట్రైలర్‌ రిలీజ్‌
  • ప్రముఖ ఓటీటీ జీ 5లో అక్టోబరు 22 నుంచి మూవీ స్ట్రీమింగ్‌
  • సునీల్‌ వాయిస్‌తో ట్రైలర్‌ స్టార్ట్
 Heads & Tales Trailer : హెడ్స్‌ అండ్‌ టేల్స్‌ ట్రైలర్‌ వచ్చేసింది

Heads & Tales Official Trailer released Premieres 22nd Oct 2021 on ZEE5: సునీల్‌, సుహాస్‌, చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ...హెడ్స్‌ అండ్‌ టేల్స్‌ (Heads & Tales). కలర్ ఫొటో ఫేమ్ సందీప్ రాజ్ (Sandeep Raj) ఈ చిత్రానికి కథ అందించారు. నటుడు సాయి కృష్ణ ఎన్రెడ్డి (Sai Krishna Enreddy) హెడ్స్‌ అండ్‌ టేల్స్‌ కు దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రముఖ ఓటీటీ జీ 5లో (ZEE5 ) అక్టోబరు 22 నుంచి (22nd Oct 2021) స్ట్రీమింగ్‌కానుంది. తాజాగా హెడ్స్‌ అండ్‌ టేల్స్‌ ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది.

అందరి కథలు ఒకే విధములు... కథనం మారే గతే బతుకులు.. నేను పంపిన మూడు సేమ్‌ కాపీలు.. ముగ్గురు అమ్మాయిల తలరాతలు అయ్యాయి చూడు అంటూ సునీల్‌ (sunil) వాయిస్‌తో ట్రైలర్‌ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ... ఒక్క రాత్రిలో జరిగే కథకు సంబంధించినది. ముగ్గురు మహిళలు తమ జీవితంలో ఎదుర్కొన్న సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నారనేది కథాంశంగా తీసుకుని ఈ మూవీని తెరకెక్కించారు.

Also Read : Uttarakhand Rains : ఉత్తరాఖండ్‌లో రెడ్‌ అలర్ట్‌.. బద్రీనాథ్‌ యాత్ర నిలిపివేత

మహిళలు తమ కోసం, తమ హక్కుల కోసం పోరాడాలని సూచించే కథాంశంతో ఈ మూవీని రూపొందించారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు చూడదగ్గ విధంగా మూవీ (movie) ఉంటుందని సినిమా యూనిట్ తెలిపింది. జీ 5లో (ZEE5) అక్టోబరు 22 నుంచి స్ట్రీమింగ్‌ (streaming) అయ్యే మూవీని చూడండి మరి.

 

Also Read : Kodali Nani : చంద్రబాబుపై ఫైర్ అయిన కొడాలి నాని

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News