Russia: రష్యా(Russia)లో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. దేశంలో కొవిడ్ మరణాలు(Covid-19 Deaths) ఎక్కువగా నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య(Coronacases) కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin) కీలక నిర్ణయం తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా అక్టోబర్ 30 నుంచి వారం పాటు వేతనంతో కూడిన సెలవుల(Paid Leaves)ను ఇస్తున్నట్టు ప్రకటించారు. దీని ప్రకారం ఉద్యోగులెవ్వరూ ఆఫీసుల(Office)కు వెళ్లాల్సిన పనిలేదు. పైగా ఆ వారం పాటు ప్రజలు ఎవరి ఇళ్లలో వాళ్లు ఉంటూ మహమ్మారి అంతానికి సహకరించడంతో వారి జీతం కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.
కరోనా కట్టడి కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్(Vaccination) తీసుకోవాలని పుతిన్ పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ తీసుకోవడాన్ని ఓ బాధ్యతగా చూడాలన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ రష్యానే కనిపెట్టినప్పటికీ అక్కడి పౌరులు వ్యాక్సిన్ వేసుకోవడానికి అంతగా సుముఖంగా లేరు. దీంతో వ్యాక్సినేషన్ నత్త నడకన సాగుతోంది.
Also Read: Covid19 Deaths: రష్యాలో మరణమృదంగం మోగిస్తున్న కరోనా వైరస్, ఒక్కరోజులోనే
కాగా గడిచిన 24 గంటల్లో కరోనా(Corona update)తో రష్యాలో 1,028 మంది మరణించారు. వైరస్ వ్యాప్తి మొదలైన తొలినాళ్ల నుంచి ఇవే అత్యధికం. గడిచిన 24 గంట్లలో రష్యాలో కొత్తగా 34,074 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా సగటున రోజుకు 1000 కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే కొన్ని యూరోపియన్ దేశాలు, ముఖ్యంగా యూకేలో కరోనా కేసుల పెరుగుతూ అక్కడి ప్రజలను వణికిస్తోంది. దీనికితోడు శీతాకాలం సమీపిస్తుండడంతో వైరస్ ఫోర్త్ వేవ్ ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
Also Read: Corona in China: చైనాలో మళ్లీ కరోనా భయాలు.. స్కూళ్లకు సెలవులు, వందలాది విమానాలు రద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook