T20 World Cup 2021: విరాట్ కోహ్లీ తరువాత టీమ్ ఇండియా సారధ్యం ఎవరు

నవంబర్ 8న జరిగే నమీబియా వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్..విరాట్ కోహ్లీకు కెప్టెన్‌గా చివరిది. ఆ తరువాత టీ20 ఫార్మట్ కెప్టెన్సీ పదవికి ఆతను వీడ్కోలు చెప్పనున్నాడు. ఇప్పటికే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 సెమీఫైనల్స్‌కు దూరమైన ఇండియా చివరి లీగ్ మ్యాచ్‌ను నమీబియాతో ఆడనుంది. అయితే విరాట్ కోహ్లీ అనంతరం ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారనేది ఆసక్తిగా మారింది.

T20 World Cup 2021: నవంబర్ 8న జరిగే నమీబియా వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్..విరాట్ కోహ్లీకు కెప్టెన్‌గా చివరిది. ఆ తరువాత టీ20 ఫార్మట్ కెప్టెన్సీ పదవికి ఆతను వీడ్కోలు చెప్పనున్నాడు. ఇప్పటికే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 సెమీఫైనల్స్‌కు దూరమైన ఇండియా చివరి లీగ్ మ్యాచ్‌ను నమీబియాతో ఆడనుంది. అయితే విరాట్ కోహ్లీ అనంతరం ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారనేది ఆసక్తిగా మారింది.
 

1 /5

శ్రేయాస్ అయ్యర్. ముంబైకు చెందిన శ్రేయాస్ అయ్యర్ ఢిల్లీ కేపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. టీ20 క్రికెట్‌లో అయ్యర్‌కు మంచి అనుభవం ఉంది. టీమ్ ఇండియా తదుపరి కెప్టెన్‌గా పరిశీలించే అవకాశముంది. 

2 /5

ఢిల్లీ వికెట్ కీపర్ మరియు బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. టీమ్ ఇండియా కెప్టెన్‌గా రిషభ్ పంత్ కూడా అర్హుడనే వాదన విన్పిస్తోంది. 

3 /5

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఆ జట్టుకు వరుసగా రెండుసార్లు ఐపీఎల్ విజేత టైటిల్ సాధించిపెట్టిన వ్యక్తి రోహిత్ శర్మ. టీమ్ ఇండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మకు తదుపరి కెప్టెన్‌గా ఎక్కువ అవకాశాలున్నాయి.

4 /5

ఐపీఎల్ టీమ్ పంజాబ్ కింగ్స్ ఎలెవన్ సారధి కేఎల్ రాహుల్ టీ20 ఫార్మట్‌లో బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ తరువాత టీ20 ఫార్మట్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌కు అవకాశాలున్నాయి.

5 /5

నవంబర్ 8న జరిగే టీ20 ప్రపంచకప్ 2021 లీగ్ దశ నమీబియా మ్యాచ్‌కు..విరాట్ కోహ్లీ చివరిసారిగా టీ20 అంతర్జాతీయ ఫార్మట్‌లో కెప్టెన్సీ వహించనున్నాడు. టీ20 ఫార్మట్‌లో ఇండియాకు 49 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించి..29 మ్యాచ్‌లలో విజయం అందించాడు. 16 మ్యాచ్‌లలో పరాజయం ఎదురైంది.