POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో ఇండియా కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్‌కు తీవ్రమైన హెచ్చరిక జారీ చేయడమే కాకుండా అల్టిమేటమ్ ఇచ్చింది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNO)సమావేశంలో భారత శాశ్వత మిషన్ కౌన్సిలర్ కాజల్ భట్ వార్తల్లో నిలిచారు. యూఎన్ సాక్షిగా పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరికలు పంపించారు. పీవోకేపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతారని చరిత్ర ఇప్పటికే నిరూపించిందని, ఉగ్రవాదులకు కొమ్ముకాయడం, వారికి శిక్షణ, ఆర్థిక సహకారం అందివ్వడం పాక్ విధానమని భారత్ యూఎన్ సమావేశంలో దుయ్యబట్టింది. పాకిస్తాన్ రాయబారి మునీర్ అక్రమ్ జమ్మూ కశ్మీర్‌పై చేసిన వాదనని కాజల్ తిప్పికొట్టారు. యూఎన్ వేదికల్ని ఉపయోగించుకొని కశ్మీర్‌పై అవాస్తవాలను ప్రచారం చేయడం పాక్‌కు కొత్త కాదన్నారు.
కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలన్నీ ఇండియాలో అంతర్భాగమని స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్(Pak Occupied Kashmir) కూడా భారత్ దేశానిదేనని, చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న ప్రాంతాలన్నీ పాక్ వెంటనే ఖాళీ చేయాలని అల్టిమేటమ్ జారీ చేశారు. పాకిస్తాన్ సహా ఇరుగు పొరుగు దేశాలతో సామరస్యంగా ఉండాలనే భారత్ కోరుకుంటుందని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపితేనే పాకిస్తాన్‌తో శాంతియుత వాతావరణంలో చర్చలు జరుగుతాయని భట్ అన్నారు. అప్పటివరకు ఇండియా సీమాంతర ఉగ్రవాదంపై కఠినమైన విధానంతోనే ముందుకు స్పష్టం చేశారు.
Also read: ఎస్బీఐ నుంచి రూ. 2 లక్షల ఫ్రీ ఇన్సూరెన్స్ ఆఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
పాక్ ఆక్రమిత కశ్మీర్ ఖాళీ చేయాల్సిందే, ఇండియా వార్నింగ్
పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేసిన ఇండియా
పాక్ ఆక్రమిత కశ్మీర్ ఖాళీ చేయాలంటూ ఆల్టిమేటమ్
యూఎన్ సమావేశంలో పాకిస్తాన్‌కు దీటైన సమాదానమిచ్చిన కాజల్ భట్