Rajinikanth phone call to Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం(నవంబర్ 18) నాటి పరిణామాలపై కన్నీరుమున్నీరుగా విలపించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పలువురు ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు, భువనేశ్వరిలకు మద్దతుగా నందమూరి ఫ్యామిలీ మీడియాకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) సైతం చంద్రబాబు నాయుడును ఫోన్లో పరామర్శించారు. జరిగిన పరిణామాలపై రజనీకాంత్ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు.
అన్నాడీఎంకె (AIADMK) పార్టీకి చెందిన సీనియర్ నేత మైత్రేయన్ కూడా చంద్రబాబును ఫోన్లో పరామర్శించారు. దీనికి సంబంధించి తన ట్విట్టర్లో వివరాలు వెల్లడించారు. ' 1984లో ఎన్టీఆర్ (NTR) సతీమణి బసవతారకం చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స తీసుకున్నప్పటి నుంచి ఆ కుటుంబం నాకు తెలుసు. ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరిని వ్యక్తిగతంగా దూషించారని తెలిసి బాధపడ్డాను. దీన్ని నేను ఖండిస్తున్నాను. ఇవాళే చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడాను.' అని మైత్రేయన్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఏపీ అసెంబ్లీలో (AP Assembly) తన భార్య వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రెస్ మీట్లో వెక్కి వెక్కి ఏడ్చిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇన్ని అవమానాలను ఏనాడు ఎదుర్కోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు, అసెంబ్లీలో భావోద్వేగపూరితంగా మాట్లాడిన చంద్రబాబు... ఇది కౌరవ సభ అని విమర్శించారు. మళ్లీ సీఎం అయ్యాకే సభలో అడుగుపెడుతానంటూ శపథం చేశారు. చంద్రబాబు, భువనేశ్వరిలకు మద్దతుగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటివి రిపీట్ చేయొద్దని... చేస్తే ఒక్కొక్కరి భరతం పడతామని హెచ్చరించారు. జూ.ఎన్టీఆర్ సహా పలువురు నందమూరి కుటుంబ సభ్యులు చంద్రబాబు, భువనేశ్వరిలకు సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సైతం చంద్రబాబు పట్ల అసెంబ్లీలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరును తప్పు పట్టారు.
Also Read: రాయలసీమ జిల్లాల్లో కుదిపేసిన భారీ వర్షాలు, 24కు చేరుకున్న మరణాలు
మరోవైపు వైసీపీ నేతలు మాత్రం అసలు అసెంబ్లీలో భువనేశ్వరి (Nara Bhuvaneshwari) ప్రస్తావనే రాలేదని చెప్తున్నారు. కేవలం సానుభూతి కోసం, రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు ఈ డ్రామాకు తెరలేపారని విమర్శిస్తున్నారు. వైసీపీ నేతలు సభలో అనని మాటలను అన్నట్లుగా చంద్రబాబు చిత్రీకరిస్తున్నారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. వ్యక్తులను, వ్యక్తిత్వాలను కించపరిచే రాజకీయాలకు తెరలేపింది చంద్రబాబే అని విమర్శించారు. తమ ఇళ్లల్లోనూ ఆడవాళ్లు ఉన్నారని... యథాలాపంగా అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తామని ప్రశ్నించారు. చంద్రబాబు దిగజారుడుతనానికి ఈ ఘటనలు నిదర్శనమన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook