‘ఇమ్రాన్ ఖాన్ నా పెద్దన్న’.. సిద్ధూ వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ గంభీర్ ఫైర్

Gautam Gambhir Twitter: పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ను తన పెద్దన్న అని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలను మాజీ క్రికెటర్, పార్లమెంట్ సభ్యులు గౌతమ్ గంభీర్ తప్పుబట్టారు. సిద్ధూ తన పిల్లల్ని ఒకసారి బోర్డర్‌కు పంపిన తర్వాత ఇమ్రాన్ ను పెద్దన్న అని పిలవాలని సూచించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2021, 11:49 AM IST
‘ఇమ్రాన్ ఖాన్ నా పెద్దన్న’.. సిద్ధూ వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ గంభీర్ ఫైర్

Gautam Gambhir Twitter: పంజాబ్ పీసీసీ ఛీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్, పార్లమెంట్ సభ్యులు గౌతమ్ గంభీర్ మండిపడ్డారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తనకు పెద్దన్న లాంటి వాడన్న సిద్ధూ మాటలను తప్పుబట్టారు. అలా అనే ముందుగా తన పిల్లల్ని బోర్డర్‌కు పంపాలని సిద్ధూకు గంభీర్ డిమాండ్ చేశారు.

“పాకిస్తాన్ అండదండలతో చెలరేగుతున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ 70 ఏళ్లుగా పోరాడుతోంది. అయితే దానికి సహకరిస్తున్న దేశాధినేతను పట్టుకొని 'పెద్దన్న'గా పేర్కొనడం సిగ్గుచేటు. నీ కుమారుడు లేదా కూతుర్ని బోర్డర్‌కు పంపిన తర్వాతే ఉగ్రవాదానికి సహకరిస్తున్న ఆ దేశాధినేతను పెద్దన్న అని పిలుచుకో. ఇది చాలా దారుణమైన విషయం" అని ఢిల్లీ పార్లమెంట్ సభ్యులు గౌతమ్ గంభీర్ ట్వీట్ చేశారు.

శనివారం ఉదయం సిద్ధూ.. పాకిస్తాన్‌ భూభాగంలోని కర్తార్‌పూర్‌ సాహిబ్‌ను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. భారత్‌, పాక్‌ ప్రధానులు మోదీ, ఇమ్రాన్‌ఖాన్‌ చొరవ వల్లే కర్తార్‌పుర్‌ నడవా తిరిగి తెరుచుకుందని, పంజాబ్‌ ఆర్థికాభివృద్ధి సాధించాలంటే వాణిజ్య కార్యకలాపాల కోసం రెండు దేశాల సరిహద్దులను తిరిగి తెరవాలని కోరారు.

పంజాబ్‌ నుంచి పాకిస్థాన్‌కు 21 కిలోమీటర్ల దూరమే ఉన్నప్పుడు ముంద్రా పోర్టు మీదుగా 2,100 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సిన అవసరం ఏంటని ఈ సందర్భంగా సిద్ధూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఇమ్రాన్‌ఖాన్‌ తనకు పెద్దన్నయ్య లాంటి వారని సంబోధించారు. ఈ నేపథ్యంలో సిద్ధూ చేసిన వ్యాఖ్యల పట్ల దుమారం రేగుతోంది. సిద్ధూ వ్యాఖ్యలపై పలువురు రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. 

Also Read: మహారాష్ట్ర: పులి దాడిలో అటవీశాఖ మహిళా ఉద్యోగి మృతి

Also Read: జైపూర్​లో దారుణం: మత్తుమందు ఇచ్చి.. మర్మాంగాన్ని కోసేసింది..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News