French bride, Bihari man: బిహార్ అబ్బాయి .. ఫ్రెంచ్ అమ్మాయి.. ఫ్రెంచ్ వధువును చూసేందుకు జనం క్యూ

హిందూ సంప్రదాయానికి (Hindu wedding rituals) గౌరవాన్నిస్తూ మేరీ హిందూ పద్దతిలోనే రాకేశ్‌ని పెళ్లి చేసుకుంది. రాకేష్, మేరి పెళ్లి వేడుక చూసేందుకు చాలా మంది బంధుమిత్రులు ఫ్రాన్స్ నుంచి ఇండియాకు వచ్చారు. ఫ్రాన్స్ అమ్మాయిని (France bride tied knot with Indian) వధువుగా చూసేందుకు గ్రామస్తులు, స్థానిక జనం సైతం విపరీతంగా ఎగబడ్డారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2021, 08:12 PM IST
French bride, Bihari man: బిహార్ అబ్బాయి .. ఫ్రెంచ్ అమ్మాయి.. ఫ్రెంచ్ వధువును చూసేందుకు జనం క్యూ

అమ్మాయిది ఫ్రాన్స్.. అబ్బాయిది బిహార్‌లోని బెగుసారయి. అమ్మాయి ఫ్రాన్స్‌లో వ్యాపారవేత్తగా రాణిస్తున్న యువతి. అబ్బాయి ఢిల్లీలో టారిస్ట్ గైడ్‌గా పనిచేస్తున్నాడు. కట్ చేస్తే వీళ్లిద్దరి మధ్య లవ్ మొదలైంది. ఆ ప్రేమను పెళ్లిగా మార్చాలని అనుకున్నారు. అమ్మాయి మేరికి భారతీయ వైవాహిక సంప్రదాయం, బంధాలపై గౌరవం, మక్కువ ఎక్కువ. రాకేష్‌కే కాదు.. రాకేష్ కుటుంబసభ్యులకు కూడా మేరి నచ్చింది. ఇరు కుటుంబాలను ఒప్పించిన రాకేష్, మేరి.. ఆదివారం భారతీయ సంప్రదాయంలో, హిందూ ఆచారం (Hindu tradition) ప్రకారం పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. 

ఇంతకీ వీళ్లిద్దరి మధ్య పరిచయం ఎలా మొదలైంది ? ఎప్పుడు మొదలైంది ? ఫ్రాన్స్‌లో ఉన్న అమ్మాయికి, ఇండియాలో ఉన్న అబ్బాయికి లింకు ఎలా కుదిరింది అనే సందేహాలే కదా మీ అందరి మదిని తొలిచేస్తున్నాయి. అక్కడికే వస్తున్నాం. వధువు మేరి ఆరేళ్ల క్రితం ఇండియాలో పర్యటించేందుకు వచ్చింది. అప్పుడే ఢిల్లీలో టూరిస్ట్ గైడ్‌గా (Tourist guide) పనిచేస్తున్న రాకేష్‌తో పరిచయమైంది. మేరి ఇండియా నుంచి వెళ్లిపోయింది. కానీ వాళ్ల స్నేహానికి సరిహద్దులు అడ్డురాలేదు. వీలు చిక్కినప్పుడల్లా ఫోన్‌లో మాట్లాడుకుంటూ తమ స్నేహాన్ని అలానే కంటిన్యూ చేశారు.

Also read : Viral Videos: ట్రెయిన్‌లో సీటు దొరక్కపోతే మీరైతే ఏం చేస్తారు ? ఇదిగో ఈ వీడియో చూడండి

మూడేళ్ల క్రితం రాకేష్‌కి ఫోన్ చేసిన మేరి.. ఫ్రాన్స్ వచ్చి తనతో పాటు కలిసి టెక్స్‌టైల్స్ బిజినెస్ ప్రారంభించాల్సిందిగా సూచించింది. మేరి కోరిక మేరకు ఫ్రాన్స్ వెళ్లిన రాకేష్ ఆమెతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. జీవితంలో కలిసి ప్రయాణించే క్రమంలోనే వాళ్లిద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి (Love marriage) చేసుకోవాలనుకున్నారు. రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్లి కోసం ఇండియాకు వచ్చారు. 

హిందూ సంప్రదాయానికి (Hindu wedding rituals) గౌరవాన్నిస్తూ మేరీ హిందూ పద్దతిలోనే రాకేశ్‌ని పెళ్లి చేసుకుంది. రాకేష్, మేరి పెళ్లి వేడుక చూసేందుకు చాలా మంది బంధుమిత్రులు ఫ్రాన్స్ నుంచి ఇండియాకు వచ్చారు. ఫ్రాన్స్ అమ్మాయిని (France bride tied knot with Indian) వధువుగా చూసేందుకు గ్రామస్తులు, స్థానిక జనం సైతం విపరీతంగా ఎగబడ్డారు. టూరిస్టుగా ఇండియాకు వచ్చి, టూరిస్టు గైడ్‌తో స్నేహం పెంచుకుని, అతడితోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం.. చూడ్డానికి అంతా సినిమా కథలా ఉంది కదూ!!

Also read : Viral Video: గ్లాసులో వాటర్ తాగుతున్న బ్లాక్ కోబ్రా.. వీడియో చూస్తే చెమటలు పట్టడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News