Civilians killed in Nagaland: నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో జరిగిన కార్పుల ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. 13 మంది పౌరులు, ఓ జవాన్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై కచ్చితంగా వివరణ ఇచ్చి తీరాలన్నారు రాహుల్. అసలు హోం మంతిత్వ శాఖ ఏం చేస్తోందని.. మన దేశంలో పౌరులు, భద్రతా సిబ్బంది సురక్షితంగా ఉన్నారా? అంటు ప్రశ్నించారు.
This is heart wrenching. GOI must give a real reply.
What exactly is the home ministry doing when neither civilians nor security personnel are safe in our own land?#Nagaland pic.twitter.com/h7uS1LegzJ
— Rahul Gandhi (@RahulGandhi) December 5, 2021
మమతా బెనర్జీ ఎమన్నారంటే..
నాగాలాండ్ ఘటన దురదృష్టకరమన్నారు పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఘటనపై విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.
Worrisome news from #Nagaland.
Heartfelt condolences to the bereaved families. I pray for the speedy recovery of those who were injured.
We must ensure a thorough probe into the incident and ensure that all victims get justice!
— Mamata Banerjee (@MamataOfficial) December 5, 2021
అసలు నాగాలాండ్ కాల్పులు ఎందుకు జరిగాయి?
నాగాలాండ్ మయన్మార్ సరిహద్దు జిల్లా అయిన మోన్‌లో.. మిలిటెంట్ల కదలికలు గుర్తించినట్లు సమాచారం అందింది. ఈ సమయంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన ఆర్మీ.. అప్పుడే బొగ్గు గనిలో విధులు ముగించికుని వెళ్తున్న కార్మికులు అటుగా వచ్చినట్లు తెలిసింది. ఈ సమయంలో జరిపిన కార్పుల వల్ల 13 మంది పౌరులు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు సమాచారం అందింది. ఈ ఘటనలో ఓ జవాను కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.
ఘటనపై విచారణకు ఆదేశం..
ఈ ఘటనపై అటు కేంద్రం, ఇటు నాగాలాండ్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విచారణ జరిపించనున్నట్లు స్పష్టం చేశాయి. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించాయి.
Also read: Third Wave of Corona: ఇండియాలో ఒమిక్రాన్ ఐదో కేసు- థార్డ్ వేవ్ తప్పదా?
Also read: Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రికార్డు- 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి