Nagaland firing: 'నాగాలాండ్ కాల్పుల ఘటన పొరపాటు- బాధ్యులపై చర్యలు తీసుకుంటాం'

Nagaland firing: సామాన్య పౌరులపై ఆర్మీ కాల్పుల ఘటనపై కేంద్ర ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తున్నట్లు హోం మంత్రి అమిత్​ షా వెల్లడించారు. ఈ విషయంపై ఆయన లోక్​ సభలో వివరణ ఇచ్చారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2021, 06:06 PM IST
  • నాగాలాండ్ కాల్పుల ఘటన దురదృష్టకరం
  • లోక్​ సభలో హోం మంత్రి అమిత షా వివరణ
  • బాధ్యులను శిక్షిస్తామని స్పష్టం
Nagaland firing: 'నాగాలాండ్ కాల్పుల ఘటన పొరపాటు- బాధ్యులపై చర్యలు తీసుకుంటాం'

Amit Shah on Monday spoke in Lok Sabha on the Nagaland firing incident: నాగాలాండ్​లో జరిగిన కాల్పుల ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్​ షా పార్లమెంట్ లోక్​ సభలో వివరణ ఇచ్చారు. ఉగ్రవాదుల గురించి అందిన సమాచారంతో.. ఆర్మీ సెర్చ్​ ఆపరేషన్​ను ప్రారంభించారని.. అయితే అదే సమయంలో అనుమానాస్పదంగా వాహనం కనిపించడంతో ఆర్మీ సిబ్బంది కాల్పులు జరిపారని షా (Amit Shah on Nagaland firing incident) చెప్పారు. ఈ పొరపాటుపై ప్రభుత్వం చింతిస్తోందని పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూస్తుందని (Amit Shah in Parliament) స్పష్టం చేశారు.

ఈ ఘటనలో వాహనంలో ఉన్న 8 మందిలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు అమిత్​ షా కాల్పులు జరిపిన తర్వాత పొరపాటు జరిగిందని గ్రహించిన ఆర్మీ సిబ్బంది.. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు షా వివరించారు.

కాల్పుల ఘటన తర్వాత.. స్థానిక గ్రామ ప్రజలు ఆర్మీ సిబ్బందిని చుట్టు ముట్టి దాడి చెసినట్లు తెలిపారు. రెండు ఆర్మీ వాహనాలకు నిప్పంటించినట్లు వివరించారు. దీనితో ఆత్మ రక్షణ కోసం మరోసారి ఆర్మీ కాల్పులు జరిపినట్లు చెప్పారు. ఈ ఘటనలో మరో ఏడు మంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు.
ప్రజల దాడిలో ఓ జవాను ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారని అమిత్​ షా పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత మోన్​ జిల్లాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నా.. ప్రస్తుతం అదుపులోనే ఉన్నట్లు స్పష్టం చేశారు అమిత్​ షా.

ఉన్నత స్థాయి దర్యాప్తు..

ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు అమిత్​ షా వివరించారు. మరోవైపు దర్యాప్తునకు ఇప్పటికే సిట్​ను ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా వెల్లడించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం నెలలోపు రిపోర్ట్ సమర్పిస్తుందని వివరించారు. నివేదికను పరిశీలించిన తర్వాత బాధ్యులను శిక్షిస్తామని స్పష్టం చేశారు అమిత్​ షా.

Also read: Honour killing: మహారాష్ట్రలో పరువు హత్య-యువతి తల నరికి సోదరుడి పైశాచికత్వం...

Also read: India Russia Summit 2021: నేడు భారత్-రష్యా వార్షిక ద్వైపాక్షిక సదస్సు-కీలక ఒప్పందాలకు ఛాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News