General Naravane: తదుపరి సీడీఎస్​గా ఆర్మీ చీఫ్​ జనరల్ నరవాణే?

General Naravane: భారత సీడీఎస్​ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో.. ఆ స్థానాన్ని భర్తీ చేసే అధికారి ఎవరనే విషయంపై చర్చ సాగుతోంది. ఆర్మీ చీఫ్ జనరల్ ఎం ఎం నరవాణె ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2021, 05:29 PM IST
  • తదుపరి సీడీఎస్​ ఎంపీకపై తీవ్ర చర్చ
  • జనరల్​ బిపిన్​ రావత్ మృతి నేపథ్యంలో కసరత్తు
  • జనరల్ ఎం.ఎం నరవాణెకు ఎక్కువ అవకాశాలు!
  • త్వరలోనే ప్రభుత్వం అధికారిక ప్రకటన!
General Naravane: తదుపరి సీడీఎస్​గా ఆర్మీ చీఫ్​ జనరల్ నరవాణే?

General M M Naravane: తమిళనాడులో జరిగిన ఘోర హెలికాప్టర్​ ప్రమాదంలో భారత త్రివిద దళాదిపతి (సీడీఎఎస్​) జనరల్​ బిపిన్ రావత్​ దుర్మరణం (General Bipin Rawat Dies In Helicopter Crash) పాలడవడం యావత్​ భారతావనిని షాక్​కు గురి చేసింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్​ సతీమణితో పాటు మరో పదకొండు మంది (ఆర్మీ అధికారులు, ఐఏఎఫ్ సిబ్బంది) కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఆ హెలికాప్టర్​లో 14 మంది ఉండగా.. ఒక్కరు మాత్రమే తీవ్ర గాయాలతో బయటపడ్డారు.

ఈ ఘటన తర్వాత జనరల్ బిపిన్ రావత్ స్థానాన్ని భర్తీ చేసే అధికారి ఎవరనే విషయంపై తీవ్ర చర్చ సాగుతోంది. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఆర్మీ చీఫ్​ మనోజ్‌ ముకుంద్‌ నరవాణె (Army chief General M M Naravane) తదుపరి సీడీఎస్​ కావచ్చనే అంచనాలు వస్తున్నాయి.

నరవాణెనే ఎందుకు?

2019 డిసెంబర్ 31 నుంచి జనరల్ ఎం.ఎం.నరవాణె ఆర్మీ చీఫ్​గా ఉన్నారు. అయితే నేవీ, ఎయిర్​ఫోర్స్​లో ఉన్న ప్రస్తుత ఉన్నతాధికారులతో పోలిస్తే.. నరవాణెనే సీనియర్​.

ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ (ఐఏఎఫ్​) చీఫ్​ మార్షల్​ వి.ఆర్​.చౌధరీ ఈ ఏడాది సెప్టెంబర్ 30న ఆ ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతలను స్వీకరించారు. ఆర్​ హరి కుమార్​ నేవీ చీఫ్ అడ్మైర్​గా గత నెల 30న నియమితులయ్యారు. దీనితో నరవాణెనే తదుపరి సీడీఎస్​గా (Next CDS of India) ప్రభుత్వం ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.

వచ్చే ఏడాది నరవాణె రిటైర్మెంట్..

ఆర్మీ చీఫ్​గా వచ్చే ఏడాది ఏప్రి​లో నరవాణె పదవి విరమణ చేయాల్సి ఉంది. అయితే సవరించి ఆర్మీ నిబంధనల ప్రకారం.. సీడీఎస్​ 65 ఏళ్లు వచ్చే వరకు సేవలందించే అవకాశముంది.

నిజానికి జనరల్ బిపిన్ రావత్​.. సీడీఎస్​ పదవి నుంచి కూడా వచ్చే ఏడాది రిటైర్మెంట్ తీసుకోవాల్సి ఉంది. అంతలోనే ఆయన.. ప్రమాదంలో మృతి చెందటం వల్ల తదుపరి సీడీఎస్​ ఎంపికపై ముందస్తుగా కసరత్తు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

సీడీఎస్​ అంటే ఏమిటి?

ఆర్మీ, నేవీ, వాయు సేనల మధ్య సమన్వయం కుదిర్చేందుకు భారత ప్రభుత్వం సీడీఎస్​ (చీఫ్​ ఆఫ్ డిఫెన్స్​ స్టాఫ్​) పదవిని సృష్టించింది భారత ప్రభుత్వం. 2019లో ఈ పదవికి ఆమోదం లభించగా.. అదే ఏడాది డిసెంబర్ 31న తొలి సీడీఎస్​గా జనరల్ బిపిన్​ రావత్​ను ఎంపిక చేసింది. చాలా ఏళ్లుగా ఈ పదవిని సృష్టించే విషయంపై చర్చ సాగింది. ఇందుకోసం పలు కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి.

ఆర్మీ చీఫ్​గా రిటైర్​ అయిన నేపథ్యంలో తివిద దళాల్లో సీనియర్ అయిన జనరల్​ బిపిన్​ రావత్​ను ఆ పదవికి ఎంపిక చేసింది ప్రభుత్వం. రావత్ రిటైర్ అయిన అనంతరం నరవాణె.. ఆర్మీ చీఫ్​గా బాధ్యతలు స్వీకరించారు.

త్రివిద దళాల ఉన్నతాధికారులతో సమన్వయం కుదుర్చడం సహా అందరికన్నా ప్రోటోకాల్​ ప్రకారంగా ఉన్నతాధికారిగా వ్యవహరిస్తారు సీడీఎస్​. అయితే దళాల వారీగా మాత్రం వాటి అధిపతులకే పూర్తి అధికారాలు ఉంటాయి.

Also read: Bipin Rawat killed Timeline: సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదం.. విషాద ప్రయాణం సాగిందిలా

Also read: Bipin Rawat death news: సర్జికల్ స్ట్రైక్స్ నుంచి మయన్మార్ మిషన్ వరకు.. బిపిన్ రావత్ కెరీర్ హైలైట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News