Stock Market today: స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు- సెన్సెక్స్ 503 పాయింట్లు డౌన్​

Stock Market News: స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాలతో ముగిశాయి. సోమవారం సెషన్​లో సెన్సెక్స్ 500 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 17,500 మార్క్​ను కోల్పోయింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2021, 03:55 PM IST
  • వరుసగా రెండో సెషన్​లోనూ మార్కెట్లకు నష్టాలు
  • ఆర్థిక, ఎఫ్​ఎంసీజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి
  • 17,500 మార్క్​ను కోల్పోయిన నిఫ్టీ
Stock Market today: స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు- సెన్సెక్స్ 503 పాయింట్లు డౌన్​

Stock Market Updates: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్​లోనూ (Stocks closing bell) నష్టాలతో ముగిశాయి. 

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్​ (BSE Sensex) 503 పాయింట్లు తగ్గి.. 58,283 వద్దకు చేరింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజీ-నిఫ్టీ (NSE Nify) 143 పాయింట్ల నష్టంతో 17,368 వద్ద స్థిరపడింది.

దేశంలో కరోనా తీవ్రత తగ్గినా.. ఒమిక్రాన్​ వేరియంట్ భయాలు వెంటాడుతున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

దాదాపు అన్ని రంగాలు డీలా పడ్డాయి. ఆర్థిక, ఎఫ్​ఎంసీజీ, ఆటో షేర్లు ప్రధానంగా ఒడుదొడుకుల్లో ఉన్నాయి. ఐటీ షేర్లు కాస్త సానుకూలంగా ఉన్నాయి.

ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..

ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్​ 59,203 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. రికార్డు స్థాయిలో అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 58,242 కనిష్ఠానికి పడిపోయింది.

నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,639 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,355 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.

లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..

బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో 8 కంపెనీలు సానుకూలంగా స్పందించగా.. 22 కంపెనీలు డీలా పడ్డాయి.

యాక్సిస్ బ్యాంక్ (2.45 శాతం), టెక్ మహీంద్రా (2.40 శాతం), పవర్​గ్రిడ్​ (1.73 శాతం), మారుతీ సుజుకీ (1.03 శాతం), టైటాన్​ (0.37 శాతం) లాభాలను నమోదు చేశాయి.

బజాజ్ ఫినాన్స్ (2.97 శాతం), బజాజ్ ఫిన్​సర్వ్​ (2.14 శాతం), రిలయన్స్ ఇండస్ట్రీస్​ (1.89 శాతం), ఎం&ఎం (1.74 శాతం), నెస్లే ఇండియా (1.51 శాతం) నష్టపోయాయి.

ఆసియాలో ఇతర మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. షాంఘై (చైనా), టోక్యో (జపాన్​) సూచీలు లాభాలను గడించాయి. సియోల్​ (దక్షిణ కొరియా), థైవాన్​, హాంకాంగ్ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూపాయి విలువ..

డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ (Rupee value) దాదాపు స్థిరంగా ఉంది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 75.76 వద్ద కొనసాగుతోంది.

Also read: Dish TV vs Yes Bank case: యస్ బ్యాంకు కుట్రలపై SEBI కి ఫిర్యాదు చేసిన డిష్ టీవీ

Also read: Gold Price Today: దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News