Wife chop off husband genitals: శృంగారానికి బలవంతపెట్టిన ఓ భర్త పట్ల అతని భార్య తీవ్ర స్థాయిలో స్పందించింది. ఏకంగా కత్తితో అతని మర్మాంగాన్ని కోసేసింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) తికంగఢ్ పరిధిలోని రాంనగర్లో ఈ నెల 7న ఈ ఘటన చోటు చేసుకుంది.
స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి త్రివేంద్ర త్రివేది వెల్లడించిన వివరాల ప్రకారం... రాంనగర్‌కి చెందిన 26 ఏళ్ల యువకుడు ఈ నెల 12న పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. తన భార్య (24) ఇష్టానికి వ్యతిరేకంగా శృంగారం కోసం (Man forced wife to have sex) ఆమెను బలవంతపెట్టానని... ఆ సమయంలో తీవ్ర కోపోద్రిక్తురాలైన ఆమె కత్తితో తన మర్మాంగాన్ని కోసేసిందని చెప్పాడు. ఈ నెల 7న ఈ ఘటన జరిగినప్పటికీ... ఆసుపత్రిలో చేరిన కారణంగా ఆలస్యంగా ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు (Madhya Pradesh Police) అతని భార్యపై కేసు నమోదు చేశారు. కాగా, ఆ దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరగ్గా... ఇద్దరి మధ్య మనస్పర్థలతో 2019లో విడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకే మళ్లీ ఒక్కటయ్యారు. అంతా సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. గతంలోనూ పలుచోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది మార్చిలో పంజాబ్‌లో ఇలాంటిదే ఓ ఘటన వెలుగుచూసింది. భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడనే (illicit Affair) అనుమానంతో భార్య అతని మర్మాంగాన్ని కోసేసింది. భర్త గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది.
Also Read: Viral video: ఎదురుగా దూసుకొస్తున్న రైలు-ట్రాక్‌పై ఏనుగు-చివరకు ఏం జరిగిందో చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook