BiggBoss Kajal Remuneration: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో చివరిగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఆర్జే కాజల్. ఎవరెన్ని విమర్శలు చేసినా నచ్చినట్టుగా ఉంటూ వచ్చింది కాజల్ మాత్రమే. ఇప్పడు కాజల్ పారితోషికం ఎంత వచ్చిందనేది చర్చనీయాంశమైంది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5(BiggBoss Telugu Season 5) మరో నాలుగు రోజుల్లో ముగుస్తోంది. హౌస్‌లో మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్లలో విజేత ఎవరనేది తేలేందుకు ఆదివారం వరకూ ఆగాల్సిందే. ఈసారి బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే అత్యంత ఘనంగా ఉంటుందని..బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బిగ్‌బాస్ హౌస్‌లో గత వారం అంటే 14వ వారం కాజల్ నిష్క్రమణ అభిమానుల్ని నిరాశ పర్చింది.
కంచుకంఠంతో అందరితీ వాదనకు దిగే కాజల్(Kajal)వచ్చేసరికి మానస్, సన్నీలతో మంచి స్నేహబంధం ఏర్పర్చుకుంది. ఎంతలా ఉంటే సన్నీకు(Sunny)ఎవిక్షన్ పాస్ రావడానికి కారణమైంది. చాలా సార్లు ఆ ఇద్దరి తరపున వకాల్తా పుచ్చుకుంది. అంతేకాదు ఓ సందర్భంగా సన్నీని నాగార్జున విమర్శిస్తుంటే.అతని తప్పు లేదంటూ సన్నీకు మద్దతుగా వాదించింది కూడా. తనతో కనెక్ట్ అయినవారి కోసం ఎందాకైనా వెళ్లే కాజల్ స్వభావం అభిమానుల్ని ఆకట్టుకుంది. బిగ్‌బాస్‌లో 14 వారాల వరకూ కొనసాగింది. అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని భావించిన యాంకర్ సన్నీ కంటే ఎక్కువ ఓట్లు రాబట్టుకోగలిగింది.
ఇప్పుడంతా కాజల్ తీసుకున్న పారితోషికంపైనే (Kajal Remuneration)చర్చ సాగుతోంది. కంటెస్టెంట్ స్థాయిని, పాపులారిటీని బట్టి ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం వారానికి ఇంత చొప్పున కంటెస్టెంట్లకు పారితోషికం ఉంటుంది. సోషల్ మీడియాలో విన్పిస్తున్న ప్రచారం ప్రకారం కాజల్‌కు వారానికి 2 లక్షలకు పైనే చెల్లించినట్టు సమాచారం. కాజల్ బిగ్‌బాస్ (BiggBoss)హౌస్‌లో మొత్తం 14 వారాలు ఉంది. అంటే మొత్తం 30 లక్షల రూపాయల వరకూ పారితోషికం అందినట్టు తెలుస్తోంది.
Also read: Janhvi Kapoor Photoshoot: గోల్డెన్ డ్రస్స్ లో అందాలు ఆరబోస్తున్న జాన్వీ కపూర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి