AP Special Status: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు గళమెత్తారు. ప్రత్యేక హోదా ఎందుకివ్వరంటూ నిలదీశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు.
పార్లమెంట్ సమావేశాల్లో ఏపీ ప్రత్యేక హోదా మరోసారి ప్రస్తావనకొచ్చింది. పార్లమెంట్ ఉభయసభల్లోనూ వైసీపీ ఎంపీలు ఏపీ ప్రత్యేక హోదాపై(Ap Special Categary Status)మాట్లాడారు. లోక్‌సభలో వైసీపీ పక్షనేత మిథున్ రెడ్డి, రాజ్యసభలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు. అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ, ప్రతిపక్షంలో ఉన్న ఎన్డీఏ కలిసే రాష్ట్రాన్ని విభజించారని గుర్తు చేశారు. రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రధాని నరేంద్ర మోదీలు పార్లమెంట్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు.
రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు పూర్తయినా..ఇంకా నెరవేర్చాల్సిన హామీలు చాలా ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు, పెట్రో కారిడార్ వయోబిలిటీ గ్యాప్ ఫండింగ్, వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్ వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ఆర్దికంగా ఇబ్బంది పడుతున్న ఏపీకు సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టును విభజన చట్టానికి ముందే నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు. విభజన చట్టంలో పోలవరానికి జాతీయ హోదా కల్పించడంతో కేంద్రమే పూర్తి చేస్తుందని ప్రకటించి ఇప్పుడు చేయకపోవడం సరైంది కాదన్నారు. సవరించిన అంచనాలకు సాంకేతిక కమిటీ ఇప్పటికే ఆమోదం తెలిపినందున కేబినెట్ తక్షణం ఆమోదించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) విషయంలో గతంలో టీడీపీ, ఎన్డీఏ ప్రభుత్వాల మధ్య ఏం జరిగిందనేది అనవసరమన్నారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను(Vizag Steel plant privatisation) విరమించుకోవాలని కోరారు.
Also read: సినీ నటి, ఎమ్మెల్యే రోజాకు తృటిలో తప్పిన ప్రమాదం, విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook