Corona cases in India: దేశంలో తగ్గిన కరోనా తీవ్రత- 90 వేల దిగువకు యాక్టివ్​ కేసులు

Corona cases in India: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కొత్త కేసుల సంఖ్య మరోసారి 8 వేల దిగువన నమోదైంది. యాక్టివ్​ కేసులు 90 వేల దిగువకు తగ్గాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2021, 09:43 AM IST
  • 8 వేల దిగువకు రోజువారీ కరోనా కేసులు
  • మరింత పెరిగిన కొవిడ్​ రికవరీ రేటు
  • తొంబై వేల దిగువకు యాక్టివ్ కేసులు
Corona cases in India: దేశంలో తగ్గిన కరోనా తీవ్రత- 90 వేల దిగువకు యాక్టివ్​ కేసులు

India corona Update: దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి 8 వేల దిగువన నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,974 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు (Corona new cases in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 12,16,011 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు తెలిపింది. 

కొవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో 343 మంది ప్రాణాలు (Corona Deaths in India) కోల్పోయారు. 7,948 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.

కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. ఒమిక్రాన్ వేరియంట్ భయాలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. తాజాగా తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ్​ బెంగాల్​లో కూడా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.

మరిన్ని వివరాలు..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 87,245 యాక్టివ్ కరోనా కేసులు (Corona active cases in India) ఉన్నాయి. 

దేశంలో కరోనా యాక్టివ్ కేసుల రేటు 0.25 శాతంగా ఉంది. కరోనా కారణంగా ఇప్పటి వరకు మొత్తం 4,76,478 మంది మృతి చెందారు. దేశంలో కొవిడ్​ మరణాల రేటు 1.37 శాతంగా ఉంది.

ఇప్పటి వరకు దేశంలో 34,718,602 మందికి కరోనా సోకగా.. అందులో 3,41,54,879 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.38 శాతంగా ఉంది.

వ్యాక్సినేషన్ ఇలా..

నిన్న దేశవ్యాప్తంగా (Covid vaccination in India) 60,12,425 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీనితో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,35,25,36,986 వద్దకు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 272,469,679 మందికి కరోనా (Corona cases world wide) సోకింది. అందులో 5,345,392 మంది మహమ్మారికి బలయ్యారు. 244,775,515 మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. 22,348,772 మంది ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్నారు.

Also read: Omicron in Tamil Nadu: తమిళనాడుకు పాకిన ఒమిక్రాన్ కేసులు.. చెన్నైకి ఒమిక్రాన్ ఎలా వచ్చిందంటే

Also read: Indian Railways Luggage Rules: రైలు ప్రయాణంలో లగేజ్ నిబంధనల గురించి తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News