Aishwarya Rai: పనామా పేపర్స్ కేసులో ఐశ్వర్య రాయ్‌కి ఈడీ సమన్లు...

Aishwarya Rai summoned by Enforcement Directorate: ఐదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన పనామా పేపర్స్ లీకేజీపై ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌కి తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 20, 2021, 12:48 PM IST
Aishwarya Rai: పనామా పేపర్స్ కేసులో ఐశ్వర్య రాయ్‌కి ఈడీ సమన్లు...

Aishwarya Rai summoned by Enforcement Directorate: ఐదేళ్ల క్రితం 2016లో ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన పనామా పేపర్స్ లీకేజీపై (Panama Paper Leakage) ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌కి తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని ఈడీ (Enforcement Directorate) ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించింది. ఐశ్వర్య రాయ్‌కి గతంలోనూ రెండుసార్లు సమన్లు జారీ చేయగా... మరికొంత సమయం కావాలంటూ విచారణను వాయిదా వేయాల్సిందిగా కోరింది. తాజా సమన్లపై ఐశ్వర్య రాయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

2016లో వెలుగుచూసిన పనామా పేపర్స్ (Panama Papers Case) దేశంలోని పలువురు ప్రముఖుల అక్రమాస్తులు, అక్రమ సంపాదన గుట్టును బయటపెట్టిన సంగతి తెలిసిందే. స్వదేశంలో ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు విదేశాల్లోని పలు డొల్ల కంపెనీల సాయంతో ఇక్కడి నుంచి సంపదను తరలించినట్లుగా బయటపడింది. ఒక్క భారత్ నుంచే దాదాపు 380 మంది పేర్లు పనామా పేపర్స్‌లో బయటపడటం తీవ్ర సంచలనం సృష్టించింది. ఇందులో అనిల్ అంబానీ, నీరవ్ మోదీ వంటి వ్యాపారవేత్తలు, ప్రముఖ క్రికెట్ సచిన్ టెండూల్కర్ పేర్లు సైతం బయటపడ్డాయి. 

దాదాపు 35 మంది ప్రస్తుత, మాజీ దేశాధినేతల పేర్లు కూడా ఇందులో బయటపడటం గమనార్హం. అలాగే 91 దేశాలకు చెందిన 300 మంది మంత్రులు, ఉన్నత హోదాల్లో ఉన్న పలువురు వ్యక్తులు పేర్లు బయటపడ్డాయి. దాదాపు 117 దేశాల్లోని 150 మీడియా సంస్థలకు చెందిన 600 మంది జర్నలిస్టుల ఇన్వెస్టిగేషన్‌లో పనామా పేపర్స్ వెలుగులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని ప్రముఖుల సంపద తరలింపుకు, డొల్ల కంపెనీల్లోకి వాటి మళ్లింపుకు 14 అంతర్జాతీయ కంపెనీలు పనిచేస్తున్నట్లు గుర్తించారు. లీకైన పనామా పేపర్స్‌ (Panama Papers) డేటాలో 1.12 కోట్ల పత్రాల ద్వారా అక్రమాస్తులు, సంపద పోగేసిన వారి వివరాలు పొందుపరచబడ్డాయి.

Also Read: Hamsa Nandini: షాకింగ్ విషయం బయటపెట్టిన హంసానందిని-క్యాన్సర్‌తో పోరాడుతున్న నటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News