Shami and Siraj fire India win Boxing Day Test vs South Africa: సెంచురియాన్ వేదికగా దక్షిణాఫ్రికా (South Africa)తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా (India) ఘన విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 305 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 68 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో కోహ్లీసేన 113 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), మొహ్మద్ షమీ (Mohammed Shami) తలో 3 వికెట్లు తీయగా.. మొహ్మద్ సిరాజ్ (Siraj), రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో భారత్ మూడు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత ఆటగాళ్ల ఫామ్ చూస్తుంటే.. దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ నిరీక్షణకు తెరపడేట్టు కనిపిస్తోంది.
బుధవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 94/4తో ఉన్న దక్షిణాఫ్రికా.. ఈరోజు మరో 97 పరుగులు జాతచేసి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. తొలి సెషన్‌లో కెప్టెన్ డీన్ ఎల్గర్ (77: 156 బంతుల్లో 12×4), తెంబా బవుమా (35 నాటౌట్: 80 బంతుల్లో 4×4) వికెట్ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడారు. ఈ ఇద్దరి ఆట చూస్తే.. మ్యాచ్ డ్రా అయ్యేట్టు కనిపించింది. అయితే ఈ సమయంలోఎల్గర్‌ని బుమ్రా ఔట్ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికాకి షాక్ తగిలింది. ఆ తర్వాత క్వింటన్ డి కాక్ (21), వియాన్ ముల్డర్ (1) కూడా త్వరహానే పెవిలియన్ చేరారు. ఇక లంచ్ అనంతరం మార్కో జాన్సెన్ (13), కగిసో రబడ (0), లుంగీ ఎంగిడి (0) ఔట్ అవ్వడంతో ప్రొటీస్ కథ ముగిసింది. భారత బౌలర్లలో బుమ్రా, షమీ తలో మూడు వికెట్లు తీశారు.
Also Read: RRR First Review: ఆర్ఆర్ఆర్ ఫస్ట్ రివ్యూ... ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్ మధ్యన చిచ్చు...
అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 174 పరుగులకు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ, జాన్సెన్ చెరో నాలుగు వికెట్లు తీశారు. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (34) టాప్ స్కోరర్. భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఒకరు కూడా చెప్పగోదగ్గ పరుగులు చేయలేదు. కేఎల్ రాహుల్ (23), ఛెతేశ్వర్ పుజారా (16), విరాట్ కోహ్లీ (18), అజింక్య రహానే (20) పూర్తిగా విఫలమయ్యారు. పంత్ ఒంటరి పోరాటం చేసి టీమిండియాకు విలువైన పరుగులు అందించాడు. దాంతో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని కోహ్లీసేన 304 పరుగుల లీడ్ లభించింది.
Also Read: Anand Mahindra: ఆ టైగర్ వీడియోపై ఆనంద్ మహీంద్రా ఫన్నీ కామెంట్స్.. వాటే సెన్సాఫ్ హ్యూమర్...
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 327 పరుగులు చేసిన విషయం తెలిసిందే. కేఎల్ రాహుల్ శతకం (KL Rahul- 123), మయాంక్ అగర్వాల్ (60) అర్థ శతకంతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి ఆరు, రబాడ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 197 పరుగులకు ఆలౌటైంది. తెంబా బవుమా (Bavuma- 52) అర్థ శతకంతో రాణించాడు. క్వింటన్ డికాక్ (34), రబాడ (25) పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీశాడు. సెంచరీ చేసిన రాహుల్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు. ఇక ఇరు జట్ల మధ్య జోహన్నెస్‌బర్గ్ మైదానంలో జనవరి 7న రెండో టెస్ట్ ఆరంభం కానుంది.
#TeamIndia WIN at Centurion 👏👏🇮🇳#SAvIND pic.twitter.com/35KCyFM4za
— BCCI (@BCCI) December 30, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి