God Father Movie: మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ షూటింగ్ అప్‌డేట్స్..విడుదల ఎప్పుడు

God Father Movie: మెగాస్టార్ చిరంజీవి  వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ఓ వైపు ఆచార్య మరోవైపు గాడ్ ఫాదర్. గాడ్ ఫాదర్ సినిమా మాత్రం అనుకున్నదానికంటే వేగంగా తెరకెక్కిస్తున్నారు. ఎందుకంటే..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 5, 2022, 07:57 AM IST
God Father Movie: మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ షూటింగ్ అప్‌డేట్స్..విడుదల ఎప్పుడు

God Father Movie: మెగాస్టార్ చిరంజీవి  వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ఓ వైపు ఆచార్య మరోవైపు గాడ్ ఫాదర్. గాడ్ ఫాదర్ సినిమా మాత్రం అనుకున్నదానికంటే వేగంగా తెరకెక్కిస్తున్నారు. ఎందుకంటే..

తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి 66 ఏళ్ల వయస్సులో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం చిరంజీవి చేతిలో నాలుగు సినిమాలున్నాయి. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన లూసీఫర్ (Lucifer)తెలుగు రీమేక్..గాడ్ ఫాదర్. చిరంజీవి ఈ సినిమా కోసం గట్టిగానే శ్రమిస్తున్నాడని తెలుస్తోంది. లుక్ విషయంలో చాలా జాగ్రత్తలతో ముందుకెళ్తున్నాడు. లూసిఫర్ సినిమా తెలుగులో విడుదలైనా కధపై నమ్మకంతో చిరంజీవి (Chiranjeevi) రీమేక్ కు ఒప్పుకున్నాడు. సినిమా షూటింగ్ మాత్రం అత్యంత వేగంగా జరుగుతోందని సమచారం. ఇప్పటికే దాదాపు సగం సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. 

ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలున్నాయి. తెలుగు పరిశ్రమ నుంచి సత్యదేవ్, అనసూయలు కన్పించనున్నారు. అటు తమిళ, మలయాళ పరిశ్రమలో పేరున్న నటుల్ని కూడా ఈ సినిమా కోసం తీసుకున్నారు. తెలుగు వెర్షన్ లో పెద్దఎత్తున మార్పులు కూడా చేశారు. మాధవన్‌ను ప్రతినాయకుడిగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman khan) కీలకపాత్రలో నటిస్తుండటం విశేషం. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ నేరుగా చెప్పాడు కూడా. చిరంజీవితో తనకున్న సంబంధం కారణంగా ఒప్పుకున్నట్టు చెప్పిన సల్మాన్ ఖాన్‌కు తొలి డైరెక్ట్ తెలుగు సినిమా ఇదే. తొలిసారిగా తెలుగు పరిశ్రమలో అడుగుపెడుతున్నాడు. గాడ్ ఫాదర్ సినిమా (God Father Movie)షూటింగ్ అయితే చాలా వేగంగా సాగుతోంది. దీనికి కారణం ఒక్కటే. వేసవి రేసులో గాడ్ ఫాదర్ సినిమా ఉండాలనేది ఆ ప్రయత్నం. ఎందుకంటే ఫిబ్రవరి 4 న ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తరువాత వేసవిలో గాడ్ ఫాదర్ విడుదల చేసేందుకు షూటింగ్ వేగవంతం చేశారు. 

Also read: RRR Movie: ఆర్ఆర్ఆర్ నిర్మాతలకు భారీ నష్టం, ప్రమోషన్స్ ఖర్చు 18 కోట్లు బూడదలో పన్నీరే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News