Jawed Habib: మహిళ జుట్టుపై ఉమ్మి.. జావెద్ హబీబ్ ఎంత ఛండాలం చేశాడంటే..

Jawed Habib Spitting on Womans hair: ఇటీవల ఓ సెమినార్‌ సందర్భంగా ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్ ఓ మహిళ జుట్టుపై ఉమ్మి వేసి ఆమెకు హెయిర్ కట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా... హబీబ్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2022, 11:44 AM IST
  • వివాదంలో ఇరుక్కున్న జావెద్ హబీబ్
  • వర్క్ షాప్‌లో మహిళ జుట్టుపై ఉమ్మి వేసిన హబీబ్
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • హబీబ్‌పై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ లేఖ
Jawed Habib: మహిళ జుట్టుపై ఉమ్మి.. జావెద్ హబీబ్ ఎంత ఛండాలం చేశాడంటే..

Jawed Habib Spitting on Womans hair: సెలూన్‌లో హెయిర్ కట్ చేసేటప్పుడు... ముందు తలపై కొన్ని వాటర్ స్ప్రే చేయడం కామన్. జుట్టు తడిగా మారితే హెయిర్ కట్ చేయడం సులువవుతుంది. ఒకవేళ వాటర్ లేకపోతే ఏం చేస్తారు... ఏం చేస్తాం ఉమ్మితే పనికానిచ్చేస్తామంటున్నాడు ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్. ఇటీవల ఓ సెమినార్‌ సందర్భంగా జావెద్ హబీబ్ ఇదే పనిచేశాడు. ఓ మహిళ తలపై ఉమ్మి వేసి ఆమెకు హెయిర్ కట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా... హబీబ్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీంతో హబీబ్ క్షమాపణలు చెప్పక తప్పలేదు. 

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన వర్క్ షాప్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వర్క్ షాప్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన జావెద్ హబీబ్‌ను పూజా గుప్తా అనే మహిళ కొన్ని ప్రశ్నలు అడిగింది. వాటికి సమాధానం చెప్పాల్సిందిపోయి హబీబ్ ఆమెపై ఫైర్ అయ్యాడు. దేశవ్యాప్తంగా తాను 900 సెలూన్స్ నడుపుతున్నానని... నీకు ఒకే ఒక్క హెయిర్ సెలూన్ ఉందని ఆమెను కించపరిచేలా మాట్లాడాడు. అక్కడితో ఆగక ఆమెను స్టేజీ పైకి పిలిచి మరింత అవమానించాడు. 

ఆ మహిళను కుర్చీలో కూర్చోబెట్టిన హబీబ్ (Jawed Habib)... ఆమె జుట్టుపై ఉమ్మి వేసి హెయిర్ కట్ చేశాడు. నీళ్లు తక్కువగా ఉంటే ఏం చేస్తామంటూ... ఆమె జుట్టుపై ఉమ్మేశాడు. హబీబ్ చర్యకు ఆ మహిళ షాక్ తిన్నది. ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ... హబీబ్ తన జుట్టుపై రెండుసార్లు ఉమ్మి వేసినట్లు వాపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న తన భర్త ఆ ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడని తెలిపింది. హబీబ్ అసిస్టెంట్ ఒకరు తమ వద్దకు వచ్చి... దీన్ని సరదాగా తీసుకోవాలని కోరినట్లు పేర్కొంది. ఈ ఘటనతో తమను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. జావెద్ హబీబ్ చర్యపై జాతీయ మహిళా కమిషన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. హబీబ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ పోలీసులకు కమిషన్ లేఖ రాసింది. దీంతో ముజఫర్ నగర్ పోలీసులు హబీబ్‌పై ఐపీసీ సెక్షన్ 355, 504 కింద కేసు నమోదు చేశారు.

క్షమాపణలు చెప్పిన జావెద్ హబీబ్ :

జావెద్ హబీబ్ చేసిన పనికి (Viral Videos) నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో హబీబ్ క్షమాపణలు చెప్పక తప్పలేదు. తాను చేసిన పనికి ఎవరైనా బాధపడి ఉంటే అందుకు క్షమాపణలు చెబుతున్నానని హబీబ్ పేర్కొన్నారు. అదే సమయంలో వర్క్ షాప్స్‌లో అందరినీ నవ్వించేందుకే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని హబీబ్ పేర్కొనడం గమనార్హం. మహిళ జుట్టుపై ఉమ్మి వేయడాన్ని హాస్యానికి ముడిపెట్టి మాట్లాడటం హబీబ్‌కు చెల్లుతుందేమో...!

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jawed Habib (@jh_hairexpert)

 

Also Read: స్కూటీ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన 8వ తరగతి విద్యార్ధి.. ట్రాఫిక్ పోలీసులకు షాకింగ్ సమాధానమిచ్చిన బాలుడు!! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News