Prisoner Swallows Phone: ఢిల్లీలోని తిహార్ జైలులోని ఓ ఖైదీ.. మొబైల్ ఫోన్ ను మింగేశాడు. జైలు వార్డెన్ చేస్తున్న తనిఖీల్లో సెల్ ఫోన్ దొరికిపోతాననే భయంతో దాన్ని మింగేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ జైలు వార్డెన్, ఇతర ఖైదీలు చూస్తుండగానే తాను ఈ పని చేసినట్లు సమాచారం. ఆ సెల్ ఫోన్ 7 సెంటీమీటర్ల పొడవు, 3 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉంది.
దీంతో వెంటనే ఆ ఖైదీని దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సెల్ ఫోన్ అతని పొట్టలో ఉన్నట్లు తేలింది. అయితే ఎలాంటి ఆపరేషన్ లేకుండానే ఆ సెల్ ఫోన్ ను ఎండోస్కోపి నిర్వహించిన నోటి ద్వారా బయటకు తీశారు.
ఆపరేషన్ తర్వాత సెల్ ఫోన్ మింగేసిన ఖైదీని వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తిహార్ జైలు అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ చేయకుండానే సెల్‌ఫోన్ తీయాలని వైద్యులు భావించిన కారణంగా.. సెల్ ఫోన్ ను బయటకు తీసుకొచ్చేందుకు 10 రోజుల సమయం పట్టిందని తెలుస్తోంది.
జనవరి 15న ఖైదీ పొట్టలో ఉన్న సెల్ ఫోన్ ను ఎండోస్కోపీ ద్వారా బయటకు తీశారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందని వివరించారు. దీంతో అతడిని తిరిగి జైలుకు పంపినట్లు స్పష్టం చేశారు.
అయితే, జైలులోకి సెల్‌ఫోన్ ఎలా వచ్చిందనే విషయం ఇంకా తెలియరాలేదు. నిబంధనలన్నీ కఠినంగా అమలు చేసినా ఫోన్ కనిపించడంపై తిహార్ జైలు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
Also Read: PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కుటుంబంలో ఎంతమందికి వర్తిస్తుంది..
Also Read: IED Recovered in Delhi: ఢిల్లీలో ఐఈడీ బాంబు కలకలం... ఉగ్ర కుట్ర భగ్నం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి