Jio Recharge Plan: జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. రూ.150లకే అన్ లిమిటెడ్ కాల్స్, హైస్పీడ్ డేటా

Jio Recharge Plan: దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియా సరికొత్త ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే అనేక ఆఫర్లతో వినియోగదారులను మన్ననలు పొందుతున్న జియో.. ఇప్పుడు రూ.150ల కంటే తక్కువ ధరతో అన్ లిమిటెడ్ కాల్స్, హైస్పీడ్ డేటాను అందిస్తుంది. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటో తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2022, 05:31 PM IST
    • రిలయన్స్ జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్
    • వినియోగదారులను ఆకర్షించేందుకు సరికొత్త ప్లాన్స్
    • రూ.150లకే అన్ లిమిటెడ్ కాల్స్, హైస్పీడ్ డేటా
Jio Recharge Plan: జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. రూ.150లకే అన్ లిమిటెడ్ కాల్స్, హైస్పీడ్ డేటా

Jio Recharge Plan: టెలికాం రంగంలో దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో ఇటీవలే తమ రీఛార్జ్ ప్లాన్ ధరలకు పెంచేసింది. అయినా.. తమ కస్టమర్లను ఆకర్షించేందుకు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది. కేవలం రూ.150 కంటే తక్కువ ధరతో అన్ లిమిటెడ్ కాల్స్, హైస్పీడ్ డేటాను అందించేందుకు ముందుకొచ్చింది. ఇంతకీ ఆ ఆఫర్ ద్వారా వినియోగదారులు పొందే సదుపాయాలేంటో తెలుసుకుందాం. 

రూ.149 రీఛార్జ్ ప్లాన్

రిలయన్స్ జియోకు సంబంధించిన రూ.149 రీఛార్జ్ ప్లాన్ 20 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ఆఫర్ ద్వారా రోజుకు 1 GB హైస్పీడ్ డేటా, 100 ఉచిత SMSలు అపరిమిత కాలింగ్ తో వస్తుంది. అంతేకాకుండా.. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ ప్రాసెసర్ కు ఉచిత యాక్సెస్ ప్రోగ్రామ్ ఇవ్వబడుతుంది. 

రూ.152 రీఛార్జ్ ప్లాన్

రూ.152 రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా రోజుకు 0.5 GB హైస్పీడ్ డేటాతో మొత్తంగా 14 GB డేటా లభిస్తుంది. దీంతో పాటు అపరిమిత కాల్స్ తో పాటు 300 SMSలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు జియో అప్లికేషన్స్ ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది. 

రూ.179 రీఛార్జ్ ప్లాన్

రూ.179 ప్లాన్ తో 24 రోజులు వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 1 GB డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్, 100 SMSలు లభిస్తాయి. వీటితో జియో అప్లికేషన్స్ యాప్స్ యాక్సెస్ ఉచితంగా అందుబాటులో ఉంటుంది.  

Also Read: Today Gold Price : దేశంలో మళ్లీ పెరిగిన బంగారం ధర...10 గ్రాముల పసిడి ధర ఎంతంటే!

Also Read: Budget 2022: కేంద్రం ఆ ప్రకటన చేస్తే- పీపీఎఫ్​ ద్వారా రూ.80 లక్షల ఆదాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News