APSRTC JAC: ఏ క్షణమైనా బస్సులను ఆపేందుకు సిద్ధమైన ఏపీ ఆర్టీసీ జేఏసీ

APSRTC JAC plan to Stir: విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఆర్టీసీ జేఏసీగా ఏర్పడ్డాయి. పీఆర్సీ సాధన సమితికి మద్దతు ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. పీఆర్సీ సాధన సమితి ఎప్పుడు చెబితే అప్పుడు సమ్మె చేపట్టి బస్సుల్ని ఆపేస్తామంటూ ఆర్టీసీ జేఏసీ నేతలు హెచ్చరించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2022, 03:57 PM IST
  • ఆర్టీసీ జేఏసీగా ఏర్పడ్డ విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు
  • పీఆర్సీ సాధన సమితికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించిన ఆర్టీసీ జేఏసీ
APSRTC JAC: ఏ క్షణమైనా బస్సులను ఆపేందుకు సిద్ధమైన ఏపీ ఆర్టీసీ జేఏసీ

AP PRC issue: పీఆర్సీ సాధన సమితికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యమంలో ఆర్టీసీ సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని.. అన్ని రకాల ఆందోళనలకు పూర్తిగా మద్దతిస్తున్నట్లు చెప్పారు.

ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ (PRC) జీవోలతో ఆర్టీసీ ఉద్యోగులకు కూడా నష్టమే అని పేర్కొన్నారు. పీఆర్సీ సాధన సమితి సూచనలతో తాము కూడా సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమంటూ ఆర్టీసీ జేఏసీ (RTC JAC) స్పష్టం చేసింది. 

ఇక ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయకముందు తమకు నాలుగు సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ వచ్చేదని జేఏసీ (JAC) నేతలు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం జారీ చేసిన జీవోతో పది సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ వచ్చే పరిస్థితి నెలకొంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Jagtial: బస్సులో ప్రయాణిస్తుండగా గుండెపోటు.. జగిత్యాల మహిళ మృతి

అసలు తాము విలీనం ఎందుకు కోరుకున్నామా అని బాధపడుతున్నామంటూ ఆర్టీసీ జేఏసీ నేతలు పేర్కొన్నారు. అసలు విలీనానికి ఎందుకు అంగీకరించామా అని ఇప్పుడు ఆలోచించే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పీఆర్సీ పోరాట సమితి చెబితే.. ఏ క్షణమైనా..అర్ధరాత్రి అయినా సరే బస్సుల్ని ఆపేస్తామని చెప్పుకొచ్చారు. చాలీచాలని జీతాలతో ఆర్టీసీ (RTC) ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారన్నారు.

Also Read: Breaking News: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మనవరాలు ఆత్మహత్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News