Frozen To Death: కెనడా బార్డర్​లో విషాదం- చలిలో గడ్డకట్టి ఇండియన్ ఫ్యామిలీ దుర్మరణం!

Frozen To Death: కెనడా-అమెరికా సరిహద్దుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఓ భారతీయ కుటుంబం చలికి గడ్డకట్టి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2022, 12:28 PM IST
  • అమెరికా-కెనాడా సరిహద్దుల్లో విషాదం
  • మంచులో గడ్డకట్టి ప్రాణాలు కోల్పోయిన ఇండియన్ ఫ్యామిలీ
  • అక్రమ వలస ప్రయత్నం విఫలమై మృత్యువు ఒడికి!
Frozen To Death: కెనడా బార్డర్​లో విషాదం- చలిలో గడ్డకట్టి ఇండియన్ ఫ్యామిలీ దుర్మరణం!

Frozen To Death: కెనడాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ కుటుంబమంతా చలికి గడ్డకట్టి మృతి చెందింది. ఈ విషాద ఘటన కెనడా-అమెరికా సరిహద్దుల్లో చోటు చేసుకుంది. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉండటం మరింత బాధాకరమైన (Indian Falmily dead) విషయం.

అక్రమంగా కెనడా నుంచి అమెరికా వలస వెళ్లేందుకు చేసిన ప్రయత్నం విఫలమవడం వల్లనే వారు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు (Illegal immigration) పేర్కొన్నాయి.

ఇంతకీ ఏమైందంటే..

అమెరికా-కెనాడా సరిహద్దు ప్రాంతంలో మానిటోబా రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు (ఆసీఎంపీ) ఇటీవల నాలుగు మృత దేహాలను కనుగొన్నారు. కెనడావైపు ఎమర్సన్​ సమీపంలో (Canada Us Border) వాటిని గుర్తించారు.

అందులో ఇద్దరు పెద్దలు, ఒక టీనేజర్​, ఓ చిన్నారి ఉన్నట్లు తెలిపారు. పోలీసుల విచారణలో వారంతా గుజరాత్​కు చెందిన భారతీయ కుటుంబగా గుర్తించినట్లు వార్తా సంస్థ ఐఏఎన్​ఎస్​ ద్వారా తెలిసింది. ఈ విషయాన్ని కెనడాలోని భారత హైకమిషన్​ కూడా ధృవీకరించింది.

ఇటీవల కెనడా నుంచి అమెరికాకు అక్రమంగా వలస వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ గ్రూప్​లో ఈ గుజరాతీ ఫ్యామిలీ కూడా ఉన్నట్లు తెలిసిందని వార్తా సంస్థ వివరించింది. అయితే ఆ ప్రయత్నం విఫలమై.. తీవ్ర మంచు తుఫాను కారణంగా గడ్డకట్టి కుటుంబమంతా ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.

మృతుల పేర్లు జగదీశ్ పటేల్​ (39), అతని భార్య వైశాలి (37), కూతురు విహంగి (11), కొడుకు ధార్మిక్​ (3)గా అధికారులు తెలిపారు.

అంతకు ముందు రోజే కొంత మంది అరెస్టు..

అయితే ఈ ఘటన జరిగిందుకు ముందు రోజు అమెరికా వైపు వెళ్తున్న ఓ వ్యాన్​ను తనిఖీ చేసిన సరిహద్దు పోలీసులు. ఇద్దరు వద్ద సరైన పత్రాలు లేవని గుర్తించారు. దీనితో పాటు వారి వద్ద చిన్నారులకు అవసరమయ్యే వస్తువులు ఉన్నట్లు కనుగొన్నారు. అయితే ఆ వ్యాన్​లో చిన్నారులు ఎవ్వరూ లేకపోవడం పోలీసుల అనుమానాన్ని మరింత పెంచింది. దీనితో పోలీసులు వారితో పాటు వారికి సహకరించిన వ్యక్తిని అరెస్ట్​ చేశారు.

అదే రోజు గుజరాతీ ఫ్యామిలీ విగత జీవులుగా సరిహద్దుల్లో పడి ఉండటం గుర్తించారు. మృత దేహాలన్ని సరిహద్దుకు కేవలం 9-10 మీటర్ల దూరంలో ఉన్నట్లు పోలీసులు (Tragedy in Canada) వెల్లడించారు.

Also read: NeoCov: కరోనా కొత్త వేరియంట్ రూపంలో ముంచుకొస్తున్న ప్రమాదం!

Also read: US First Execution 2022: అమెరికాలో ఈ ఏడాది తొలి మరణ శిక్ష అతనికే...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News