Budget 2022: కేంద్ర బడ్జెట్ 2022-23 నేడు పార్లమెంట్ ముందుకు రానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో పద్దుపై ప్రసంగించనున్నారు.
కొవిక్ సంక్షోభం కాలంలో వస్తున్న రెండో బడ్జెట్ ఇది. దీనితో ఈ సారి కూడా పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది కేంద్రం.
పేపర్ లెస్ బడ్జెట్ అయినందున అందరికీ బడ్జెట్ వివరాలు స్పష్టంగా తెలిసే విధంగా యూనియన్ బడ్జెట్ యాప్‌ను తీసుకొచ్చింది కేంద్రం. నిర్మలా సీతారామన్ ప్రసంగం ముగిసిన తర్వాత బడ్జెట్ 2022కు సంబంధించిన అన్ని వివరాలను ఈ యాప్‌లో చూడొచ్చు.
బడ్జెట్ 2022-23పై వివిధ వర్గాల అంచనాలు..
ఉద్యోగులు: స్టాండ్డర్డ్ డిడక్షన్ పరిమితి పెంచొచ్చని వేతన జీవులు ఆశిస్తున్నారు. ఈ డిడక్షన్ జీతంలో పన్నులేని ఆదాయాన్ని పెంచుతుంది.
ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ పెంచే విధానాన్ని 2005-06 రద్దు చేయగా.. మోదీ ప్రభుత్వం దానిని తిరిగి 2018-19 ఆర్థిక సంవత్సరంలో పునర్ప్రవేశపెట్టింది.
స్టాండర్డ్ డిడక్షన్ ప్రస్తుతం రూ.50 వేలుగా ఉంది. రూ.లక్షలకు పెంచాలని డిమాండ్ వినిపిస్తోంది.
దీనితో పాటు వర్క్ ఫ్రం హోంకు పన్ను లేని అలవెన్సులు ఇవ్వాలని కూడా సామాన్యులు కోరుతున్నారు.
మహిళా పారిశ్రామికవేత్తలు
సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ) విభాగాల్లోని మహిళా పారిశ్రామికవేత్తలు కూడా బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు.
కరోనా కాలంలో చిన్న పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయిన కారణంగా.. ప్రభుత్వం నుంచి అదనపు సబ్సిడీలు, వడ్డీ రహిత రుణాల వంటివి కోరుకుంటున్నారు.
ఆదాయపు పన్ను పరిమితి పెంపు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షలుగా ఉన్న ఇన్‌కం ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఆదాయపు పరిమితిని పెంచాలని కూడా అన్ని వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయపు పన్ను వర్తించే.. వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు.
క్రిప్టో కరెన్సీ..
బిట్‌కాయిన్ గత ఏడాది రికార్డు సృష్టించింది. ఒక కాయిన్ విలువ 65 వేల డాలర్లు దాటింది. అయితే ప్రభుత్వం ఇప్పటికే బిట్‌కాయిన్‌ను నిషేధించబోమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
వాటిని ఆస్తులుగా పరిగణిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది.. దానిని కరెన్సీగా గుర్తించే వీలు లేదని తెలిపింది.
మరి ఈ బడ్జెట్లో క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వ వైఖరి స్పష్టమయ్యే అవకాశాలున్నాయి.
ఇక వీటితో పాటు కరోనా, చిప్‌ల కొరత సహా వివిధ కారణాలతో సంక్షోభం ఎదుర్కొన్న రంగాలకు కేంద్రం ఊరటనివ్వాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ అంశాలన్నింటిపై కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో బడ్జెట్ ద్వారా స్పష్టం కానుంది.
Also read: Budget 2022: త్వరలో తగ్గనున్న స్మార్ట్‌ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్స్ ధరలు?
Also read: Budget 2022: కేంద్ర బడ్జెట్ 2022 కోసం ప్రత్యేక యాప్.. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook