Amit Shah: నేడు ముచ్చింతల్‌కు అమిత్ షా.. సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు...

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు రానున్నారు. ముచ్చింతల్‌లోని సమతా మూర్తి విగ్రహాన్ని ఆయన దర్శించుకోనున్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2022, 03:13 PM IST
  • నేడు హైదరాబాద్ కు అమిత్ షా
  • రామానుజాచార్యుల విగ్రహ దర్శనం చేసుకోనున్న కేంద్రమంత్రి
  • రాత్రి 8 గంటలకు ఢిల్లీకి తిరిగి పయనం
Amit Shah: నేడు ముచ్చింతల్‌కు అమిత్ షా.. సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు...

Statue of Equality: ముచ్చింతల్‌‌లోని 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని (Statue of Equality) దర్శించుకునేందుకు... కేంద్రంహోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. మంగళవారం సాయంత్రం 4.30కు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ (Hyderabad) చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ముచ్చింతల్‌లోని (Muchintal) చినజీయర్‌ ఆశ్రమానికి వెళ్తారు. దివ్యక్షేత్రంలోని రామానుజుడిని దర్శించుకోని.. 108 దివ్య క్షేత్రాలను సందర్శిస్తారు. యాగశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాత్రి 8 గంటలకు ఢిల్లీకి తిరిగి పయనమవుతారు.

ఇప్పటికే ఆరు రోజుల కార్యక్రమంలో ప్రధాని మోదీ (PM Modi), ఏపీ ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఏడవ రోజు (8 ఫిబ్రవరి 2022) ప్రవచన మండపంలో దేశ, విదేశాల నుంచి విచ్చేసిన కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. సాయంత్రం 5గంటలకు శ్రీలక్ష్మీ నారాయణ మహాయజ్ఞ హోమం.. రాత్రి 9 గంటలకు పూర్ణాహుతి జరగనుంది.

శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో (Ramanuja Sahasrabdi Utsav) భాగంగా... సోమవారం 33 స్త్రీ దేవతామూర్తుల ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. 108 దివ్యదేశాల్లోని 33 ఆలయాల్లో ప్రాణప్రతిష్ట చేశారు. 33 స్త్రీ దేవతామూర్తులతో శోభా యాత్ర నిర్వహించారు. గోపుర శిఖరాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Also Read: Statue of Equality: సమతా మూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం ఇచ్చిన ప్రధాని మోదీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News