Video: దారినపోయే వాళ్లకు హీరోయిన్ ఫ్రీ హగ్స్.. మాకూ కావాలంటున్న నెటిజన్లు...

Richa Chadha Free Hugs Video: బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా ఇవాళ దయాగుణ దినోత్సవం సందర్భంగా తన పాత వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2022, 11:58 AM IST
  • రిచా చద్దా ఫ్రీ హగ్స్ వీడియో
  • ఇవాళ ర్యాండమ్ యాక్ట్స్ ఆఫ్ కైండ్‌నెస్ డే
  • రెండేళ్ల క్రితం నాటి వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన హీరోయిన్
 Video: దారినపోయే వాళ్లకు హీరోయిన్ ఫ్రీ హగ్స్.. మాకూ కావాలంటున్న నెటిజన్లు...

Richa Chadha Free Hugs Video: బాలీవుడ్ నటి రిచా చద్దా 'ఫ్రీ హగ్స్' వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చేతిలో 'ఫ్రీ హగ్స్' అనే పోస్టర్‌ను పట్టుకుని రోడ్డు పైకి వచ్చిన చద్దా.. దారినపోయే ఎంతోమందికి ఫ్రీ హగ్స్ ఇచ్చింది. వారిని ఆప్యాయంగా అలుముకుని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. నిజానికి ఇది రెండేళ్ల క్రితం నాటి వీడియో. ఇవాళ 'Random Acts of Kindness Day' కావడంతో రిచా చద్దా ఆ వీడియోను మరోసారి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అప్పటికి, ఇప్పటికి ప్రపంచంలో ఎంత మార్పోనని వాపోయింది.

'రెండేళ్ల క్రితం ఓరోజు నేనిలా గడిపాను. ఈ వీడియోని చూడగానే ఇంత తక్కువ టైమ్‌లోనే మన ప్రపంచం ఎంతలా మారిపోయిందో కదా అనిపించింది. కోవిడ్‌కి ముందు ఇలా చేయడం సాధ్యపడింది.. భవిష్యత్తులో మరోసారి చేస్తాననే నమ్మకముంది. ప్రపంచానికి కావాల్సింది ప్రేమ.. అమితమైన ప్రేమ.. గాయాలు మానేంతవరకు, ఖాళీలన్నీ ప్రేమతో నిండేంతవరకు.. అందరికీ దయాగుణ దినోత్సవ శుభాకాంక్షలు' అని ఆ పోస్టులో రిచా చద్దా పేర్కొంది.

రిచా చద్దా వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. మేడమ్ మాకూ ఓ హగ్ కావాలి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మేడమ్.. ఇది ఎక్కడో చెప్పండి... నాకూ ఓ హగ్ కావాలని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. కొంతమంది నెటిజన్లు ఇది పాత వీడియో అని తెలియక..  కోవిడ్ టైమ్‌లో ఇలాంటి పనులేంటని రిచా చద్దాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిచా చద్దా పోస్ట్ చేసిన ఈ వీడియోకి ఇప్పటివరకూ 42,726 లైక్స్ వచ్చాయి. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Richa Chadha (@therichachadha)

 

Also Read: Car Rental: మారుతి సుజుకి బంపరాఫర్.. రూ.12 వేలకే నెల పాటు అద్దె కారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News