సౌదీ అరేబియాలో మహిళలకు అనేక పరిమితులు ఉంటాయని అంటూ ఉంటారు. అలాంటి దేశంలో తొలిసారిగా మహిళలు వెహికల్ డ్రైవింగ్ నేర్చుకొనేందుకు అనుమతిని మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ సందర్భంగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అతి పెద్ద ముస్లిం యూనివర్సిటీ మైదానంలో మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఇటీవలే సౌదీలో మహిళల కోసం ప్రత్యేకంగా డ్రైవింగ్ స్కూలును ఏర్పాటు చేస్తున్న విషయంపై సౌదీ మహారాజు సల్మాన్ దాదాపు గంటసేపు మాట్లాడారు. సంప్రదాయ దుస్తులు ధరించి కూడా మహిళలు డ్రైవింగ్ క్లాసులకు హాజరు కావచ్చని ఆయన తెలిపారు. 18 ఏళ్లు నిండిన మహిళలు డ్రైవర్ల సహాయం లేకుండా సొంతంగా వాహనాలు నడుపుకోవచ్చని ఆయన చెప్పారు. 2011, 2013 సంవత్సరాలలో కూడా మహిళల కోసం డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు పై ప్రభుత్వం స్పందించింది. అయితే అప్పట్లో వ్యతిరేకత భారీస్థాయిలో రావడం వల్ల ఆ ఆలోచనను విరమించుకుంది.