ముఖ్యమంత్రి గెటప్‌లో.. పండగ చేసుకున్న "మహేష్ బాబు"

ప్రిన్స్ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న భరత్ అను నేను చిత్రం కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 

Last Updated : Mar 19, 2018, 02:27 PM IST
 ముఖ్యమంత్రి గెటప్‌లో.. పండగ చేసుకున్న "మహేష్ బాబు"

ప్రిన్స్ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న భరత్ అను నేను చిత్రం కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కైరా అడ్వాణీ కథానాయికగా న‌టిస్తోంది. తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా ఫ్యాన్స్ కోసం ఈ చిత్ర నిర్మాతలు ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఒక రాష్ట్ర సీఎం సంప్రదాయ దుస్తులు ధరించి ఉగాది వేడుకలు ఎలా జరుపుకుంటారో ఈ తాజా పోస్టర్‌లో చాలా చక్కగా చూపించారు డిజైనర్లు.

ఈ పోస్టర్‌లో మహేశ్ బాబు తెలుగువారి సంప్రదాయాన్ని ప్రతిబింబించే పంచెకట్టుతో కనిపించడం విశేషం. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో మహేశ్‌బాబు, స్టార్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ద్వితీయ చిత్రం భరత్ అను నేను. గతంలో వీరిద్దరి కాంబినేషనులో వచ్చిన శ్రీమంతుడు సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. భరత్ అను నేను చిత్రాన్ని ఏప్రిల్ 20న విడుదల చేసేందుకు ప్లాన్ రెడీ అవుతోంది. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. 

Trending News