CM KCR Wanaparhy Tour: వనపర్తి జిల్లాలో సీఎం కేసీ‌ఆర్ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం

ఈ రోజు తెలంగాణ సీఎం కేసీ‌ఆర్ వనపర్తి జిల్లాలో పర్యటన పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేయనున్న సీఎం. ఆ వివరాలు ఇలా...   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2022, 11:58 AM IST
  • వనపర్తి జిల్లా పర్యటనలో సీఎం కేసీ‌ఆర్
  • పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం
  • ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీకి శంకుస్థాప‌న
CM KCR Wanaparhy Tour: వనపర్తి జిల్లాలో సీఎం కేసీ‌ఆర్ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం

Telangana CM KCR Wanaparhy Tour: వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపనల కోసం తెలంగాణ సీఎం కేసీ‌ఆర్ ఈ రోజు పర్యటించనున్నారు.  వనపర్తి జిల్లాలో అగ్రి‌క‌ల్చర్‌ మార్కెట్‌ యార్డు , టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, కలె‌క్టరే‌ట్‌ను ప్రారం‌భించి, ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీకి శంకుస్థాప‌న వంటి అభివృద్ధి కార్యకలాపాలను సీఎం ప్రారంభించనున్నారు. 

మొదట సీఎం కేసీ‌ఆర్ ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబద్ నుండి వనపర్తి జిల్లాకు హెలికాఫ్టర్ ద్వారా బయల్దేరి.. 11:45 గంటలకు వ్యవ‌సాయ మార్కె‌ట్‌‌యార్డుకు చేరుకోనున్నారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డ్ ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మ‌న‌ ఊరు - మన‌బడి అనే కార్యక్రమాన్ని ఇక్కడి నుండే ప్రారంభించనున్నారు. దీనికి సంబందించిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయబడ్డాయి. 

దీని తరువాత..  సీఎం కేసీఆర్ నాగవరంలో 12:50 గంటలకు టీఆర్ఎస్ కార్యాలయాన్నిప్రారంభించనున్నారు. అనంతరం... 1:20 గంటలకు వనపర్తి జిల్లా కలెక్టరేట్ ప్రారంభించనున్నారు. తరువాత వనపర్తి టీఆర్ఎస్, ఇతర ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో సమావేశం అయ్యాక భోజనం చేస్తారు. 

3:25 గంటలకు వనపర్తి గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసిన తరువాత అక్కడే ఏర్పాటు చేయబడిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తైన వెంటనే కేసీఆర్ హైదరాబద్ కు తిరిగి రానున్నారు. 

సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యలో పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. 8 మంది ఎస్పీలు, 1,840 పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేసారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News