Miryalaguda Prabhas Fans protest for Radhe Shyam Movie tickets: రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ పూజా హగ్డే జంటగా నటించిన సినిమా 'రాధేశ్యామ్'. అత్యంత భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా థియేటర్లోకి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం (మార్చి 11) విడుదల అయింది. ఈరోజు ఉదయం నుంచే రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు.
అయితే తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలో సినిమా టికెట్ల రాజకీయం నడుస్తోంది. ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా.. టికెట్లు అన్నీ అధికార పార్టీ నాయకుల ఇళ్ల నుంచే విక్రయించబడుతున్నాయట. ఈ క్రమంలో రాధేశ్యామ్ సినిమా టిక్కెట్లు కూడా థియేటర్లో కాకుండా అధికార పార్టీ నాయకుల ఇళ్ల నుంచే విక్రయించబడ్డాయి. దాంతో రెబల్ స్టార్ అభిమానులు ఆందోళకు దిగారు. పెద్ద ఎత్తున నినాదానాలు చేశారు.
రాధేశ్యామ్ సినిమా ఈరోజు విడుదల అవ్వగా.. గురువారం ప్రభాస్ అభిమానులు స్థానిక రాఘవ థియేటర్‌ను అందంగా హీరో కటౌట్లతో ముస్తాబు చేశారు. టికెట్ల కోసం థియేటర్ యాజమాన్యం దగ్గరకు వెళ్లగా.. టికెట్లు అన్ని స్థానికంగా గల ఓ అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఇంటికి చేరాయని, అక్కడి నుంచే వార్డుల వారీగా విక్రయించబడుతున్నాయని చెప్పారు. దాంతో ప్రభాస్ అభిమానులు థియేటర్ ఎదుట ఆందోళనకు దిగారు. మిర్యాలగూడలో అభిమాన నటుడి సినిమా కూడా న్యాయంగా చూసే పరిస్థితి లేదని, ఇక్కడ కూడా అధికార పార్టీ నాయకుల పైరవీలు, హవా కొనసాగుతుందని అభిమానులు మండిపడుతున్నారు.
రాఘవ థియేటర్ ఎదుట టికెట్ల విషయంపై గురువారం రాత్రి అభిమానులు ఆందోళన చేస్తుండగా.. అదే స్థాయిలో స్థానిక ప్రజా ప్రతినిధి ఇంటి దగ్గర కూడా టికెట్ల కోసం అభిమానులు ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై పోలీసులు కూడా స్పందించక పోవడం గమనార్హం. ఇక 1970 నాటి వింటేజ్ ప్రేమ కథతో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రీమియర్ షోలు పడడంతో ఫాన్స్ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read: Horoscope Today March 11 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు గొడవలకు దూరంగా ఉండాలి! లేదా..!!
Also Raed: Punjab election result 2022: ఆప్ జోరుకు కాంగ్రెస్ విల విల- రెండు చోట్లా ఓడిన సీఎం చన్నీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook