Cholesterol Symptoms: అధిక కొలెస్ట్రాల్ కారణంగా మీలో ఈ భయంకరమైన లక్షణాలను గమనించారా?

High Cholesterol Symptoms: ఈరోజుల్లో చాలామంది అధిక కొలెస్ట్రాల్ సమస్యను ఎదుర్కొంటున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే ఇలాంటి సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ సమస్యకు వెంటనే నివారణ చర్యలను తీసుకోకపోతే భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు అంటున్నారు. ఈ క్రమంలో శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుదలకు సంబంధించిన లక్షణాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2022, 02:03 PM IST
Cholesterol Symptoms: అధిక కొలెస్ట్రాల్ కారణంగా మీలో ఈ భయంకరమైన లక్షణాలను గమనించారా?

High Cholesterol Symptoms: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక మంది చిన్న వయసులోనే గుండె, మెదడు, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. శరీరంలో అధికమవుతున్న కొలెస్ట్రాల్ గురించి యువత ఆందోళన చెందుతున్నారు. చెడ్డు కొవ్వుపదార్థాలు (కొలెస్ట్రాల్) ఆరోగ్యానికి హానికరం. 25 నుంచి 35 ఏళ్ల వయసు వారిలో ఇలాంటి కొలెస్ట్రాల్ సమస్యలు ఎదురైతే వారు తక్షణంగా జాగ్రత్త పడడం మంచిది. అయితే యువతలో అధిక కొలెస్ట్రాల్ లక్షణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు

1. పాదాలలో తిమ్మిరులు

ఏదైనా పని చేస్తున్నప్పుడు వారి చేతుల్లో జలదరింపు లేదా చీమ కుట్టినట్లు అనిపించినప్పుడు అది కొలెస్ట్రాల్ లక్షణం కావచ్చు. ఆక్సిజన్‌తో కూడిన రక్తం (మంచి రక్తం) అవయవాలకు చేరనప్పుడు ఇది జరుగుతుంది.

2. చెమటలు పట్టడం

విపరీతంగా చెమటలు పట్టడం వంటి సమస్య ఉన్న వారిలో కూడా అధిక కొలెస్ట్రాల్ పెరుగుతుందనే దానికి సూచన. కొలెస్ట్రాల్ కారణంగా గుండె తక్కువ రక్తాన్ని శరీర భాగాలకు పంప్ చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అతిగా చెమలు పట్టడం వంటి సమస్య ఎదురవుతుంది. 

3. కళ్లపై పసుపు రంగు దద్దుర్లు

కళ్లపై పసుపు మచ్చలు ఉంటే.. అది కొలెస్ట్రాల్ పెరుగుదలకు లక్షణం కావచ్చు. రక్తంలో కొవ్వు స్థాయిలు పెరిగినప్పుడు ఇది సంభవిస్తుంది.

4. విపరీతమైన నొప్పులు

మెడ, దవడ, పొత్తికడుపు, వీపు నొప్పులు కలిగిన వారిలో కొలెస్ట్రాల్ పెరిగినట్లు సూచినగా చెప్పవచ్చు. \

ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు!!

ఈరోజుల్లో ప్రజలు సాధారణంగా పెరుగుతున్న కొలెస్ట్రాల్ లక్షణాలను విస్మరిస్తారు. కానీ, కొలెస్ట్రాల్ పెరగడం వల్ల భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. అందుకే అలాంటి లక్షణాలను విస్మరించకుండా వైద్యుడిని సంప్రదించి.. తగిన చికిత్స పొందడం మంచిది. 

(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొన్ని నివేదికల నుంచి గ్రహించబడింది. ఈ చిట్కాలను పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరిచడం లేదు.)     

Also Read: Earning Money: రూ.399 ఖర్చుతో ప్రతినెలా లక్షల రూపాయలను సంపాదించవచ్చు- అదెలాగో తెలుసుకోండి!

ALso Read: Holi 2022 Celebration: హోలీ సెలెబ్రేషన్స్.. ఒక్క నిమిషంలో 100 బెలూన్స్ నీటితో నింపొచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News