Item Songs: ఐటమ్ సాంగ్స్ వర్సెస్ స్టార్ హీరోయిన్స్..ఇక నుంచి ఐటమ్ సాంగ్స్‌లో స్టార్ హీరోయిన్సే

Item Songs: దక్షిణాదిన స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న రష్మిక మందన్నా..పుష్ప సినిమాతో పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచేసింది. ఐటమ్ సాంగ్స్‌లో సమంత సంపాదించిన క్రేజ్‌తో..ఇప్పుడు ఐటమ్ సాంగ్స్‌ను ప్రధాన నటీమణుల్తో చేయించాలనే ట్రెండ్ ప్రారంభమైంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 16, 2022, 06:44 AM IST
Item Songs: ఐటమ్ సాంగ్స్ వర్సెస్ స్టార్ హీరోయిన్స్..ఇక నుంచి ఐటమ్ సాంగ్స్‌లో స్టార్ హీరోయిన్సే

Item Songs: దక్షిణాదిన స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న రష్మిక మందన్నా..పుష్ప సినిమాతో పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచేసింది. ఐటమ్ సాంగ్స్‌లో సమంత సంపాదించిన క్రేజ్‌తో..ఇప్పుడు ఐటమ్ సాంగ్స్‌ను ప్రధాన నటీమణుల్తో చేయించాలనే ట్రెండ్ ప్రారంభమైంది.

మొన్నటి వరకూ ఐటమ్ సాంగ్స్ సంగతి వేరు. ఇప్పుడు వేరు. పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగ్‌లో నటించినప్పటి నుంచి ఆ పాటకు క్రేజ్ పెరిగిపోయింది. ఐటమ్ సాంగ్స్‌ను స్టార్ నటీమణుల్తో చేయించాలనే ఆలోచన మొదలైంది. అందుకే ఇప్పుడు రష్మిక మందన్నా వంటి స్టార్ హీరోయిన్లకు కూడా ఐటమ్ సాంగ్ ఆఫర్లు వస్తున్నాయి. అయితే పారితోషికం కాస్త ఎక్కువే ఉంటుంది. దక్షిణాదిలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్లు ఒక్కో సినిమాకు 2-3కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు. ఐటెమ్ సాంగ్స్‌కైతే మరింత డిమాండ్ చేస్తున్నారు. సమంత.. పుష్ప సినిమా ఐటెమ్ సాంగ్ కోసం కోటిన్నర పారితోషికం తీసుకుంది. గని చిత్రం కోసం తమన్నా కోటిరూపాయలు వసూల్ చేసింది. తాజాగా రష్మికకు అలాంటి అవకాశమే వచ్చినట్టు తెలుస్తోంది.

టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్‌లో యానిమల్ పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. ఆ పాటను దక్షిణాది భామతో చేయించాలనేది సందీప్ ఆలోచన. ఈ సాంగ్ కోసం రష్మికా మందన్నాను సంప్రదించారట. రష్మిక ఈ సాంగ్‌ కోసం 2 కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం.

రష్మిక ప్రస్తుతం పూర్తి స్థాయి సినిమాలకు 2 కోట్లు పారితోషికం తీసుకుంటోంది. 30 రోజుల వరకు కాల్షీట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఐటెమ్ సాంగ్ అయితే ౩ -5 రోజులు మాత్రమే. దీనికి రష్మిక రెండు కోట్లు డిమాండ్ చేయడంతో నిర్మాతలు షాకయ్యారని తెలుస్తోంది. అయితే ఎలాగైనా రష్మికనే కావాలని భావించిన నిర్మాతలు చివరకు కోటిన్నర ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. కోటిన్నరకు అంగీకరిస్తుందా.. లేక రెండు కోట్లు డిమాండ్ చేస్తుందా అనేది చూడాలి. మొత్తానికి పుష్ప సినిమాతో స్టార్ హీరోయిన్లకు ఐటమ్ సాంగ్ క్రేజ్ ఏర్పడటమే కాకుండా..నిర్మాతలు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుదామని చూస్తున్నారు.

Also read : Rashmika mandanna: శ్రీవల్లి రోజు రోజుకు ఇంత క్యూట్​గా మారుతోందేంటీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News